పెళ్లై నిండా వారం కాలేదు. కాళ్ల పారాణీ, చేతులకు పెట్టుకున్న మెహందీ ఇంకా పోలేదు.. అప్పుడే యాక్టింగ్ అంటూ సెట్లోకి ఎంట్రీ ఇచ్చేసింది సామ్. పైగా ఈ విషయాన్ని తెలియజేస్తూ కేరవాన్‌లో డైరెక్టర్ నందినీరెడ్డి, మేకప్ ఆర్టిస్ట్ అవ్ని రాంబియాతో తాను మాట్లాడుతూ దిగిన ఫోటోను షేర్ చేసేసింది. ‘వర్క్ ఈజ్ గాడ్..’ అంటూ ఓ కొటేషన్ కూడా ఇచ్చేసింది.
ప్రస్తుతం ఈ ఫోటోపై ఫిల్మ్ వర్గాల్లో చర్చ మొదలైంది. సమంత ఎంత వర్క్ హాలిక్కో, వృత్తిని తనెంత గౌరవిస్తుందో ఈ పోస్టే ఓ నిదర్శనమని అంతా అనుకుంటున్నారు. పరిణీతి చోప్రా, ప్రియాంక చోప్రా కూడా ఇలాగే పళ్లైన కొద్దిరోజులకే షూట్‌లోకి ఎంటరై అందర్నీ ఆశ్చర్యపరిచారు. సామ్ మరీ నాలుగు రోజులకే తన ‘మాయింటి బంగారం’ సెట్లోకి అడుగుపెట్టేశారు. ఈ సినిమాకు కథానాయిక మాత్రమే కాదు. నిర్మాత కూడా సమంతే కావడం విశేషం.