Samantha-Sidhu Jonnalagadda | స్టార్ హీరోల పక్కన యంగ్ హీరోయిన్లు నటించడం మాములే. కానీ స్టార్ హీరోయిన్ల పక్కన ఓ యంగ్ హీరో నటించడం అరుదు. ప్రస్తుతం టాలీవుడ్లో ఓ స్టార్ హీరోయిన్ ఓ యంగ్ హీరోతో జత కట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఇంతకీ ఎవరా? స్టార్ హీరోయిన్ అనుకుంటున్నారా? ఆమె మరెవరో కాదు సమంత. ఒకప్పుడు స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన సామ్.. ఈ మధ్య లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది. అవి సామ్‌కు మంచి పేరునే తెచ్చిపెట్టాయి. ఇక ఇటీవలే వచ్చిన శాకుంతలంతో ఆ పేరు కాస్త చెరిగిపోయింది. సామ్ మళ్లీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయకపోవడమే బెటర్ అనే కామెంట్స్ కూడా వినిపించాయి.
ప్రస్తుతం సామ్, విజయ్‌తో కలిసి ఖుషీ సినిమా చేస్తుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్‌లో రిలీజ్ కానుంది. ఇక ఇదంతా పక్కన పెట్టేస్తే తాజాగా సామ్ ఓ యంగ్ హీరోతో నటించడానికి సిద్ధం అయింది. ఇంతకీ ఆ యంగ్ హీరో ఎవరా అనుకుంటున్నారా? ఆయన మరెవరో కాదు సిద్ధూ జొన్నలగడ్డ. డీజే టిల్లుతో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్న సిద్దూ ప్రస్తుతం ఆ సినిమా సీక్వెల్లో నటిస్తున్నాడు. కాగా నందిని రెడ్డి తాజాగా సిద్ధూను కలిసి ఓ కథ వినిపించిందని టాక్. అమ్మాయి కన్నా తక్కువ వయసున్న అబ్బాయి.. వాళ్లిద్దరి మధ్య ప్రేమ.. ఇలా ఏజ్‌గ్యాప్ లవ్‌స్టోరీ కాన్సెప్ట్‌తో ఓ కథను సిద్ధం చేసిందట.
సిద్ధూ కూడా కథను ఒకే సిట్టింగ్‌లో ఒకే చేశాడట. ఇక ఆయనకు జోడీగా సమంతను ఫిక్స్ చేసిందట నందని రెడ్డి. జబర్దస్త్, ఓ బేబి వంటి సినిమాలతో సామ్, నందిని మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ క్రమంలోనే సామ్‌తో ఈ న్యూఏజ్ లవ్‌స్టోరీని తెరకెక్కంచనుందట. ఇక సామ్ యశోదలో ఉన్నీ ముకుందన్, శాకుంతలంలో దేవ్ మోహన్ వంటి చిన్న హీరోలతో నటించినప్పటికీ.. వాళ్లు వేరే ఇండస్ట్రీ వాళ్లు కావడంతో అంతగా చర్చ జరుగలేదు. అయితే సిద్దూ ఇక్కడి వాడు కావడం పైగా ఈ మధ్యే కాస్త ఫేమ్ తెచ్చుకోవడంతో ఒక్క సారిగా సామ్‌తో జోడీ అనగానే అందరూ షాక్‌కు గురవుతున్నారు. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.