Samantha Akkineni | సమంతకు ఆ పాత్ర చేయడం చాలా కష్టమట..!
టాలీవుడ్ (Tollywood) హీరోయిన్ సమంత (Samantha Akkineni) తన కెరీర్ లో గ్లామర్ తోపాటు డీగ్లామరైజ్ పాత్రల్లో నటించింది. మరోవైపు యూటర్న్, ఓ బేబి, ది ఫ్యామిలీ ఫ్యాన్ మ్యాన్ 2 లాంటి విభిన్న జోనర్లలో సినిమాలు చేసింది.

టాలీవుడ్ (Tollywood) హీరోయిన్ సమంత (Samantha Akkineni) తన కెరీర్ లో గ్లామర్ తోపాటు డీగ్లామరైజ్ పాత్రల్లో నటించింది. మరోవైపు యూటర్న్, ఓ బేబి, ది ఫ్యామిలీ ఫ్యాన్ మ్యాన్ 2 లాంటి విభిన్న జోనర్లలో సినిమాలు చేసింది. సవాలుతో కూడిన పాత్రలు చేసేందుకు ఎప్పుడూ సిద్దంగా ఉంటుందని, సామ్ చేసే సినిమాలు చూస్తే అర్థమవుతుంది. అయితే ప్రతీ యాక్టర్ కు ఏదో ఒక జోనర్ లో నటించాలంటే కొంత కష్టంగా ఉంటుంది. మరి సామ్ కు కష్టంగా అనిపించే కేటగిరి ఏంటో తెలుసా..? కామెడీ.
అవును కామెడీ (comedy) టచ్ తో సినిమాలు చేయడమంటే అంత సులభమేమి కాదని చాలా మంది నటీనటులు అభిప్రాయపడుతుంటారు. బాలీవుడ్ (Bollywood) మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పింది సమంత. ఇతర జోనర్ సినిమాల కంటే కామెడీ సినిమాలు చేయడం తనకు చాలా కష్టంగా అనిపిస్తుందని చెప్పింది. భావోద్వేగ సన్నివేశాల్లో నటించడం కష్టమని చాలా మంది అంటుంటారు. కానీ నా విషయంలో మాత్రం కామెడీ జోనర్ చాలా కష్టమైంది. ప్రత్యేకించి ఫీమేల్ యాక్టర్ల కోసం కామెడీ స్క్రిప్ట్ రాయాలంటే చాలా చాలా కష్టమైన పని అంటూ చెప్పుకొచ్చింది.
నటీనటులందరికి అన్నింటి కన్నా ముఖ్యమైంది హాస్యాన్ని పండించే టైమింగ్. సీన్ తీసే సమయంలో సరైన హావభావాలు చూపించకపోతే, ఆ హాస్య సన్నివేశం పండటం కష్టమని, కామెడీ చేయడం సాధ్యం కాదని పేర్కొంది సమంత. ఈ భామ ప్రస్తుతం విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ కాతు వాకుల రెండు కాధల్ (Kaathu Vaakula Rendu Kaadhal) లో నటిస్తోంది. నయనతార, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!
Aamir Khan | చిరంజీవి కోసం అమీర్ ఖాన్ స్పెషల్ షో
Gautham Menon | డాన్ లో మెరువనున్న స్టార్ డైరెక్టర్..!
Viral Video | కొండకోనల్లో దారి తప్పిన నటుడు.. గుర్తుపట్టి సెల్ఫీలు దిగిన పోలీసులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
‘ఎంజీయూలో అధ్యాపకుల కొరతపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

