Sidhu Jonnalagadda Next Movie | ‘డీజే టిల్లు’తో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్నాడు సిద్దూ జొన్నలగడ్డ. ముఖ్యంగా యూత్‌లో సిద్దూకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రస్తుతం అదే జోష్‌తో ‘టిల్లూ స్క్వేర్’ సినిమా పూర్తి చేస్తున్నాడు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దీనితో పాటుగా ఇటీవలే సుకుమర్ ప్రొడక్షన్ హౌజ్‌లో ఓ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపకుంటున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి నందిని రెడ్డి దర్శకత్వంలో సిద్దూ ఓ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సుకుమార్ ప్రొడక్షన్ హౌజ్‌లో తెరకెక్కే సినిమా కంటె ముందే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందట. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో సిద్దూకు జోడీగా సమంత హీరోయిన్గా నటించనుందట. నందిని రెడ్డికి సమంతతో ఉన్న చనువుతో కథ చెప్పి ఒప్పించిందట. ఇక సమంత ఇమేజ్‌కు తగ్గట్లే ఆమె క్యారెక్టర్ ఈ సినిమాలో ఉండనుందట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపకుంటుంది. ఇక ఇటీవలే నందిని రెడ్డి దర్శకత్వం వహించిన అన్ని మంచి శకునములే మూవీ రిలీజై బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.