Dulquer Salmaan | నేరుగా ఓటీటీలోకి ‘సెల్యూట్’ చిత్రం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మణిరత్నం తెరకెక్కించిన 'ఓకే బంగారం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దుల్కర్ 'మహానటి' సినిమాతో తెలుగింట మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నాడు.
Dulquer Salmaan | మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మణిరత్నం తెరకెక్కించిన ‘ఓకే బంగారం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దుల్కర్ ‘మహానటి’ సినిమాతో తెలుగింట మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. మలయాళంతో పాటు తెలుగులోనూ ఈయన సినిమాలు ఏకకాలంలో విడుదలవుతున్నాయి. ఇటీవలే ఈయన ‘హే సినామిక’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం విడుదలైన మొదటి షో నుంచే నెగిటీవ్ రివ్యూలను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈయన నటించిన సెల్యూట్ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల కానుంది.
క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నేరుగా ప్రుముఖ ఓటీటీ సంస్థ సోనిలివ్‌లో మార్చి 18నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను సోనిలివ్ సంస్థ విడుదల చేసింది. దుల్కర్ ఈ చిత్రంలో పోలీస్ పాత్రలో నటించాడు. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దుల్కర్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. డయానా పెంటీ హీరోయిన్గా నటించింది. దుల్కర్ గత చిత్రం కురూప్ తెలుగులోనూ మంచి వసూళ్లను సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- dulquersalmaan
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

