Vishwak Sen | ఫ్యాన్స్ మీట్ వివాదంపై మరోసారి స్పందించిన విశ్వక్ సేన్.. ఆ రోజు జరిగిన తప్పుకు క్షమాపణలు!
Vishwak Sen | యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించి, దర్శకత్వం వహించిన ‘కల్ట్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన ఫ్యాన్స్ మీట్ మాత్రం వివాదానికి దారితీసింది. అభిమానులతో ఫొటోలు దిగేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారీగా జనం తరలిరావడంతో గందరగోళం నెలకొంది.
Vishwak Sen | యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించి, దర్శకత్వం వహించిన ‘కల్ట్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన ఫ్యాన్స్ మీట్ మాత్రం వివాదానికి దారితీసింది. అభిమానులతో ఫొటోలు దిగేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారీగా జనం తరలిరావడంతో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ఫొటో సెషన్‌ను మధ్యలోనే నిలిపివేసి విశ్వక్ సేన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు చేశారు.
అక్టోబర్ 25న హైదరాబాద్‌లో విశ్వక్ సేన్ అభిమానుల కోసం ప్రత్యేకంగా ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. అయితే అభిమానుల రద్దీని నియంత్రించడంలో నిర్వాహకులు విఫలమయ్యారు. విశ్వక్ కోసం రెండు గంటల పాటు ఎదురుచూసినా ఫొటోలు దిగే అవకాశం ఇవ్వలేదని కొందరు అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా బౌన్సర్లు, ఈవెంట్ సిబ్బంది తమతో సరిగా ప్రవర్తించలేదని ఆరోపించారు. ఈ పరిణామంపై విశ్వక్ సేన్ ఆ రోజు రాత్రే సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సరైన ఏర్పాట్లు లేకపోవడం, ఊహించిన దానికంటే ఎక్కువ మంది అభిమానులు రావడంతో అందరినీ కలవలేకపోయానని విచారం వ్యక్తం చేశారు. తన కోసం వచ్చి నిరాశతో వెనుదిరిగిన అభిమానులకు క్షమాపణలు చెప్పారు.
తాజాగా ‘కల్ట్’ సినిమా విడుదల సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లోనూ ఈ వివాదంపై విశ్వక్ సేన్‌కు ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన స్పందిస్తూ.. ఫ్యాన్స్ మీట్ కోసం తాము ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నామని తెలిపారు. అయితే నిర్వాహకుల వైపు కూడా కొన్ని తప్పులు జరిగాయని అంగీకరించారు. ఎంత ముందుగా సిద్ధమైనప్పటికీ, ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో అభిమానులు రావడంతో పరిస్థితిని అదుపు చేయలేకపోయామని వివరించారు. ఆ రోజు కార్యక్రమానికి వచ్చి నిరాశతో వెనుదిరిగిన ప్రతి ఒక్కరికీ మరోసారి క్షమాపణలు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ మీట్ వివాదంపై విశ్వక్ సేన్ మరోసారి తన వివరణ ఇచ్చినట్లయింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishwak Sen | ఫ్యాన్స్ మీట్ వివాదంపై మరోసారి స్పందించిన విశ్వక్ సేన్.. ఆ రోజు జరిగిన తప్పుకు క్షమాపణలు!
Sir Patrick Stewart | హాలీవుడ్లో తీవ్ర విషాదం.. దిగ్గజ నటుడు సర్ పాట్రిక్ స్టీవర్ట్ కన్నుమూత
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ‘స్నేక్స్ అండ్ ల్యాడర్స్’ టాస్క్.. నామినేషన్స్‌లో ఆరుగురు!
BTech Admissions | ఇంజినీరింగ్ చదువుకు తగ్గుతున్న క్రేజ్.. భారీగా తగ్గుతున్న బీటెక్ అడ్మిషన్లు
Israel Results | ఇజ్రాయెల్‌లో తుది ఫలితాలు వెల్లడి.. ఏ పార్టీకీ దక్కని మెజారిటీ.. ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యమేనా..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

