Sir Patrick Stewart | హాలీవుడ్లో తీవ్ర విషాదం.. దిగ్గజ నటుడు సర్ పాట్రిక్ స్టీవర్ట్ కన్నుమూత
Sir Patrick Stewart | హాలీవుడ్ (Hollywood) లో తీవ్ర విషాదం నెలకొన్నది. అనారోగ్యంతో దిగ్గజ నటుడు (Legendary Actor) సర్ పాట్రిక్ స్టీవర్ట్ (Sir Patrick Stewart) కన్నుమూశారు. ‘ఎక్స్-మెన్ (X-Men)’ చిత్రాలలో ప్రొఫెసర్ ఛార్లెస్ జేవియర్ (Professor Charles Xavier) గా, ‘స్టార్ ట్రెక్ (Star Trek)’ సిరీస్‌లో కెప్టెన్ జీన్-లూక్ పికార్డ్ (Captain Jean Luc Picard) గా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ఆయన స్థానం సంపాదించుకున్నారు.
Sir Patrick Stewart : హాలీవుడ్ (Hollywood) లో తీవ్ర విషాదం నెలకొన్నది. అనారోగ్యంతో దిగ్గజ నటుడు (Legendary Actor) సర్ పాట్రిక్ స్టీవర్ట్ (Sir Patrick Stewart) కన్నుమూశారు. ‘ఎక్స్-మెన్ (X-Men)’ చిత్రాలలో ప్రొఫెసర్ ఛార్లెస్ జేవియర్ (Professor Charles Xavier) గా, ‘స్టార్ ట్రెక్ (Star Trek)’ సిరీస్‌లో కెప్టెన్ జీన్-లూక్ పికార్డ్ (Captain Jean Luc Picard) గా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ఆయన స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన వయస్సు 86 ఏళ్లు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ (Los Angeles) లో ఉన్న తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు.
సర్ పాట్రిక్ మరణించిన విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు, ప్రతినిధులు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దాంతో హాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొన్నది. కొంతకాలంగా అల్జీమర్స్, లూయీ బాడీ డిమెన్షియా వంటి నాడీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న పాట్రిక్ స్టీవర్ట్.. కుటుంబసభ్యుల సమక్షంలో ప్రశాంతంగా ప్రాణాలు విడిచారు. కుటుంబ సభ్యులు, ఆప్తమిత్రుల ప్రేమపూర్వక వాతావరణంలో సంగీతం, ప్రార్థనల నడుమ ఆయన తుది శ్వాస విడిచారని స్టీవర్ట్ కుటుంబం భావోద్వేగ ప్రకటన చేసింది.
సర్ పాట్రిక్‌కు భార్య సన్నీ ఓజెల్తోపాటు మొదటి వివాహం ద్వారా కలిగిన ఇద్దరు పిల్లలు డేనియల్ స్టీవర్ట్, సోఫీ అలెగ్జాండ్రా-స్టీవర్ట్ ఉన్నారు. బ్రిటన్‌లో నాటక రంగంతో నటుడిగా ప్రయాణం ప్రారంభించిన పాట్రిక్ స్టీవర్ట్.. రాయిటర్ షేక్స్పియర్ కంపెనీలో అద్భుతమైన నటనతో గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత హాలీవుడ్ వైపు అడుగులు వేసి అంతర్జాతీయ వేదికపై చెరగని ముద్ర వేశారు. ‘స్టార్ ట్రెక్ : ది నెక్ట్స్ జెనరేషన్’ సిరీస్‌లో కెప్టెన్ పికార్డ్గా ఆయన చూపించిన గంభీరమైన అభినయం పాట్రిక్ స్టీవర్ట్‌ను గ్లోబల్ స్టార్‌గా నిలబెట్టింది.
తెలుగు ప్రేక్షకులకు కూడా ‘ఎక్స్-మెన్’ డబ్బింగ్ సినిమాల ద్వారా పాట్రిక్ స్టీవర్ట్ సుపరిచితులు. వీల్‌చైర్‌లో ఉంటూ విలక్షణ శక్తులున్న సూపర్ హీరోలకు నాయకత్వం వహించే ప్రొఫెసర్ ఎక్స్ పాత్రలో ఆయన జీవించారు. ‘లోగన్’ సినిమాలో హ్యూ జాక్‌మన్‌తో కలిసి ఆయన పండించిన భావోద్వేగాలు సినీ ప్రియుల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. కాగా పాట్రిక్ స్టీవర్ట్ మృతిపట్ల హాలీవుడ్ ప్రముఖులు, తోటి నటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేస్తున్నారు. ఇది నిజంగా గుండె పగిలే సమయమని సర్ పాట్రిక్ తనకు మంచి మిత్రుడని, గొప్ప నటుడని, తాను చేసిన ఎన్నో పాత్రలకు ప్రాణం పోశాడని ‘స్టార్ ట్రెక్’ సహ నటుడు విలియం షాట్నర్ కొనియాడారు.
మనం ఈరోజు వెండితెరపై ఒక దిగ్గజాన్ని కోల్పోయామని, ఆయన నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ తనతోనే ఉంటాయని ‘ఎక్స్-మెన్’ స్టార్ హీరో హ్యూ జాక్మన్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. అదేవిధంగా ‘రాబిన్ హుడ్’ చిత్రంలో పాట్రిక్ స్టీవర్ట్‌తో కలిసి పనిచేసిన కేరీ ఎల్వెస్ స్పందిస్తూ.. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆ గంభీరమైన స్వరం ఎప్పటికీ మరిచిపోలేమని, ఆయన కుటుంబానికి తన సానుభూతి తెలియజేస్తున్నానని నివాళులర్పించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sir Patrick Stewart | హాలీవుడ్లో తీవ్ర విషాదం.. దిగ్గజ నటుడు సర్ పాట్రిక్ స్టీవర్ట్ కన్నుమూత
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ‘స్నేక్స్ అండ్ ల్యాడర్స్’ టాస్క్.. నామినేషన్స్‌లో ఆరుగురు!
BTech Admissions | ఇంజినీరింగ్ చదువుకు తగ్గుతున్న క్రేజ్.. భారీగా తగ్గుతున్న బీటెక్ అడ్మిషన్లు
Israel Results | ఇజ్రాయెల్‌లో తుది ఫలితాలు వెల్లడి.. ఏ పార్టీకీ దక్కని మెజారిటీ.. ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యమేనా..!
SIR Enumeration | తెలంగాణలో ‘సర్’ షెడ్యూల్ పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

