షారుఖ్ ఇంటిపై సల్మాన్ కన్ను!
ముంబయిలోని షారుఖ్‌ఖాన్ నివాసం ‘మన్నత్'కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అరేబియా సముద్రానికి అభిముఖంగా సకల విలాసాలతో కూడిన ఈ భవనం ముంబయిలోని ఖరీదైన నివాసాల్లో ఒకటని చెబుతారు. చాలా ఏళ్ల క్రితమే షారుఖ్‌ఖాన్ ఈ బంగ్లాను కొనుగోలు చేశారు. అయితే తొలుత ఈ ఇంటిని సల్మాన్‌ఖాన్ తీసుకోవాలనుకున్నారట
ముంబయిలోని షారుఖ్‌ఖాన్ నివాసం ‘మన్నత్’కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అరేబియా సముద్రానికి అభిముఖంగా సకల విలాసాలతో కూడిన ఈ భవనం ముంబయిలోని ఖరీదైన నివాసాల్లో ఒకటని చెబుతారు. చాలా ఏళ్ల క్రితమే షారుఖ్‌ఖాన్ ఈ బంగ్లాను కొనుగోలు చేశారు. అయితే తొలుత ఈ ఇంటిని సల్మాన్‌ఖాన్ తీసుకోవాలనుకున్నారట. ఒక్కడికే అంత పెద్ద ఇల్లు ఎందుకని తండ్రి వారించడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడట.
ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు సల్మాన్‌ఖాన్. ‘కెరీర్లో నిలదొక్కుకుంటున్న తొలి రోజులవి. సముద్రతీరానికి దగ్గరగా ఉన్న ఆ బంగ్లాను చూస్తే ముచ్చటేసేది. ఆ ఇల్లు అమ్మకానికి పెట్టినప్పుడు తొలుత నా దగ్గరకే వచ్చారు. కొనడానికి అన్ని రకాలుగా సిద్ధమైపోయా. చివరకు నాన్న సలహాతో వొద్దనుకున్నా’ అని సల్మాన్‌ఖాన్ తెలిపారు. ఆరు అంతస్తుల ఆ బంగ్లాకు షారుఖ్‌ఖాన్ భార్య గౌరీఖాన్ దాదాపు రెండొందల కోట్లతో ఇంటీరియర్ డెకరేషన్ చేయించింది. షారుఖ్‌ఖాన్ అభిమానుల సందడితో మన్నత్ పరిసరాలు ఎప్పుడూ బిజీగా కనిపిస్తాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Buy
- house
- mannat
- salman khan
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

