సినిమా టైటిల్ సల్మాన్‌ను ఇబ్బందులు పెడుతున్నది. పేరు విషయంలో ఎప్పుడూ ఎదుర్కోని సందిగ్ధంలో పడుతున్నారాయన. ఆయన కొత్త చిత్రానికి ముందుగా ‘కభీ ఈద్ కభీ దివాళి’ అనే టైటిల్ పెట్టారు. ఆ తర్వాత దాన్ని ‘భాయిజాన్’గా మార్చారు.
ఇప్పుడీ టైటిల్‌ను ముందున్న ‘కభీ ఈద్ కభీ దివాళి’గానే కొనసాగించాలని నిర్ణయించారట. దేశం ఒకటే..మనమంతా ఒక్కటే అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి ఒక వర్గానికి చెందిన పేరును పెట్టడం సరికాదన్న ఆలోచనలో పడ్డారట చిత్రబృందం. కులమతాలకు అతీతంగా అందరూ ఇష్టపడేలా ముందున్న టైటిల్‌నే ఖరారు చేయాలని భావిస్తున్నారు. ఫర్హాద్ సమ్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.