అగ్ర నటుడు సల్మాన్‌ఖాన్ ధరించిన రామ్‌జన్మభూమి వాచ్ సోషల్‌మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. లిమిటెడ్ ఎడిషన్‌గా లగ్జరీ బ్రాండ్ జాకబ్ అండ్ కో కంపెనీ ఈ చేతి గడియారాన్ని తయారు చేసింది. ఈ వాచ్‌ను ధరించిన ఫొటోలను గురువారం సల్మాన్‌ఖాన్ తన సోషల్‌మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. దీని ఖరీదు 61 లక్షలని కంపెనీ ప్రకటించింది.
అయోధ్య రామమందిరం, రామలక్ష్మణులు, హనుమాన్తో పాటు హిందూ దేవతామూర్తుల చిహ్నాలను పొందుపరుస్తూ ఈ గడియారాన్ని తయారుచేశారు. సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘సికందర్’ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో సల్మాన్‌ఖాన్ ఈ వాచ్ ఫొటోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోపై సల్మాన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సిసలైన లౌకికవాది అంటూ ప్రశంసిస్తున్నారు.