Salman Khan | బుల్లి తెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్యక్రమం పలు భాషలలో సక్సెస్ ఫుల్‌గా నడుస్తూ అత్యంత ఆదరణ పొందింది. ఇక హిందీలో కూడా ఈ షోకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ షో కి హోస్ట్‌గా బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఎప్పటినుంచో ఉన్నారు. పవర్ ఫుల్ హోస్టింగ్‌తో ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. మత్కారమైన వ్యాఖ్యలు, కౌంటర్లతో షోకు ఎనలేని క్రేజ్ తెచ్చారు. అయితే, తాజా వీకెండ్ ఎపిసోడ్లో సల్మాన్ ప్రవర్తనపై సోషల్ మీడియాలో వివాదం రేగింది. నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వీడియోల్లో సల్మాన్ ముఖం ఉబ్బిపోయినట్లు, కళ్లు వాచినట్టు కనిపించిందని చెబుతున్నారు.
కొంతమంది ఆయన ప్రవర్తన కూడా విచిత్రంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో “సల్మాన్ ఖాన్ మద్యం తాగి బిగ్ బాస్ ఎపిసోడ్ హోస్ట్ చేశాడా?” అనే ప్రశ్న చర్చనీయాంశమైంది. ఇక సల్మాన్ అభిమానులు మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. వాస్తవానికి, సల్మాన్ ఇటీవల చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారని, దాంతోనే ఆయన అలసిపోయి కనిపించారని చెబుతున్నారు. మహాభారత్ సీరియల్ నటుడు పంకజ్ ధీర్ మరణించడంతో సల్మాన్ ఆయన అంత్యక్రియలకు హాజరయ్యాడు. ఆ తర్వాత సౌదీ అరేబియాలోని రియాద్ వెళ్లి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్‌లతో వేదిక పంచుకున్నారు.
అనంతరం నేరుగా భారత్‌కి తిరిగి వచ్చి తన కొత్త సినిమా షూటింగ్లో పాల్గొని, వెంటనే బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్‌కి హాజరయ్యాడు. టైట్ షెడ్యూల్ కారణంగానే సల్మాన్ సరిగా నిద్రపోలేదని, అందువల్ల కళ్లలో వాపు, ముఖం ఉబ్బినట్లు కనిపించిందని అభిమానులు స్పష్టంచేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఈ వీడియోలు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. కొందరు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మరికొందరు సరదాగా మీమ్స్ షేర్ చేస్తున్నారు.ఇక ఈ ఆరోపణలపై సల్మాన్ ఖాన్ అధికారికంగా ఎలాంటి స్పందన లేదు. కానీ ఆయన టీమ్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం “ఇది కేవలం అలసట వల్ల వచ్చిన మార్పులు మాత్రమే” అని చెబుతున్నారు. మరి ఇప్పటికైన ట్రోలింగ్కి పులిస్టాప్ పడుతుందా అనేది చూడాలి.