బాలీవుడ్లో మూడు దశాబ్దాలు పైబడిన స్టార్డమ్ సల్మాన్ ఖాన్‌ది. ఇప్పటికీ ఆయన సినిమాలకు అదే క్రేజ్. ఇంత సుదీర్ఘమైన నట ప్రయాణంలో ఏ రోజూ దర్శకత్వం వైపు అడుగులు వేయలేదు సల్మాన్. నటుడిగానే కొనసాగారు. దర్శకుడికి తోచిన సలహాలు ఇచ్చేవారేమో కానీ నేరుగా మెగాఫోన్ పట్టింది లేదు. అయితే ఇప్పుడా టైమ్ వచ్చిందంటున్నారు సల్మాన్ సన్నిహితులు. సల్మాన్ ఖాన్ కొత్త సినిమా ‘కభీ ఈద్ కభీ దివాలీ’ త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్నది. ఈ చిత్రానికి ఫర్హాద్ సమ్జీ దర్శకత్వం వహించాలి. అయితే ఈ చిత్రానికి ఫర్హాద్ బదులు సల్మాన్ దర్శకత్వం చేయాలనుకుంటున్నారట. ఈ విషయాన్ని సల్మాన్ బృందం చెబుతోంది. వారి మాటల ప్రకారం చూస్తే సల్మాన్ గత ఐదేళ్లుగా తన దర్శకులను గైడ్ చేస్తూనే ఉన్నాడట. పేరుకు దర్శకుడు కాకపోయినా చాలా వరకు సినిమాను తానే దగ్గరుండి చూసుకుంటాడట.