Salman Khan – AR Murugadoss | కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఏఆర్ మురుగదాస్, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘సికందర్'(Sikandar). జై హో సినిమా తర్వాత ఏఆర్ మురుగదాస్, సల్మాన్ ఖాన్ కాంబోలో ఈ సినిమా రానుండడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఈద్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ నుంచి తాజాగా టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ముందు అనుకున్నట్లుగా సల్మాన్ బర్త్‌డే కానుకగా.. డిసెంబర్ 27నే విడుదల చేద్దామని ప్లాన్ చేశారు. కానీ భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోవడంతో టీజర్‌ను వాయిదా వేసి నేడు విడుదల చేశారు. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్గా సాగిన ఈ ట్రైలర్‌ను మీరు చూసేయండి.
ఇక ఈ సినిమాను నడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను 2025 ఈద్ కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రష్మిక మందన్నా కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో సత్యరాజ్ విలన్‌గా నటించనున్నట్టు బీటౌన్ సర్కిల్ టాక్. సముద్ర మట్టానికి 33 వేల అడుగుల ఎత్తులో ఎయిర్‌క్రాఫ్ట్‌లో సల్మాన్ ఖాన్‌పై వచ్చే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రం 200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్టు బీటౌన్ సర్కిల్ టాక్.