Salman Khan | బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం తన సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా గడుపుతున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం సికందర్ (Sikandar) ఒకటి. కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. ఈ సినిమాను నడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా.. ఈ చిత్రంలో సత్యరాజ్ విలన్‌గా నటిస్తున్నాడు. రంజాన్ కానుకగా మార్చి 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా మూవీ ప్రమోషన్స్‌లో పాల్గోంటున్నాడు.
ఒక ఇంటర్వ్యూలో భాగంగా.. ఈ సినిమా కాంట్రవర్సీ అవుతుందన్న ప్రశ్నకు సల్మాన్ సమాధానమిస్తూ.. తాను కాంట్రవర్సీలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపాడు. నా జీవితంలో చాలా కాంట్రవర్సీలను ఎదుర్కొన్నాను. ఇకపై ఎటువంటి వివాదం అవసరం లేదు. నా జీవితంలో ఇప్పటికే చాలా వివాదాలను చూశాను. ఇకనుంచైన ఈ జీవితంలో వివాదాలు లేకుండా ఉండాలని కోరుకుంటున్నా. అలాగే కాంట్రవర్సీలతో ఏ సినిమా కూడా హిట్ అవ్వదంటూ సల్మాన్ చెప్పుకోచ్చాడు.
#WATCH | Mumbai: “…Bohot saare controversies se guzar chuke hai hum, humko nahi chahiye koi controversy…Yeh pariwar bas without controversies life-long rahe…Kaafi dekh chuke hai hum” says actor Salman Khan pic.twitter.com/Ixr39TqYky
— ANI (@ANI) March 29, 2025