Salman Khan-Pooja Hegde | టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్దే, బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ డేటింగ్లో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ (Kisi Ka Bhai Kisi Ki Jaan)’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్లో వీరిద్దరికీ పరిచయం ఏర్పడిందని.. ప్రస్తుతం ఇద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ పలు వెబ్సైట్లలో సైతం కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై సల్మాన్ స్నేహితుడు తాజాగా స్పందించాడు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేశాడు.
‘ఇలాంటి బాధ్యతారహితమైన వార్తలు వ్యాప్తి చేసేవారికి సిగ్గుండాలి. పూజా హెగ్దే సల్మాన్‌కి కూతురు లాంటిది. కలిసి సినిమాల్లో నటించినంత మాత్రానా.. రిలేషన్లో ఉన్నట్లేనా..? కొంతమంది మూర్ఖులు కేవలం పబ్లిసిటీ కోసమే ఇలాంటి అనవసరమైన వార్తలను పుట్టిస్తున్నారు. అంతేకానీ, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు’ అని స్పష్టం చేశారు. ఇకనైనా రూమర్స్‌కు పులుస్టాప్ పెట్టండి అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
సల్మాన్, పూజా హెగ్దే కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ (Kisi Ka Bhai Kisi Ki Jaan)’. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఫర్హాద్ షంజీ దర్శకత్వం వహిస్తున్నాడు. వెంకటేష్, జగపతిబాబు, షెహ్నాజ్ గిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది.