Salman Khan | బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ప్రతి ఏడాది ఈద్‌ని ఎంతో ఘనంగా జరుపుకుంటాడన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈద్‌కి తన సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటాడు. తాజాగా సికందర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ మూవీ అంతగా అలరించలేకపోయింది. అయితే సల్మాన్ ఖాన్ తన ఇంట ఈద్ పార్టీ నిర్వహించగా, ఈ కార్యక్రమంలో సంప్రదాయ దుస్తులు కాకుండా కార్టూన్ థీమ్ పాంట్ ఒకటి ధరించి భారీ భద్రత మధ్య కనిపించాడు. ఇక పార్టీకి సోనాలి బెంద్రే పింక్ మరియు బ్లూ టోన్డ్ సల్వార్ సూట్ ధరించి హాజరైంది.
ఇక సోనాక్షి సిన్హా తన భర్త జహీర్ ఇక్బాల్‌తో కలిసి సల్మాన్ ఖాన్ ఈద్ బాష్‌కు హాజరైంది. ఈ జంట కలిసి ప్రత్యేకంగా ఫొటోలకి పోజులిచ్చారు. ఇక బబ్లీ గార్ల్ జెనీలియా డిసౌజా రితేష్ దేశ్ముఖ్తో కలిసి పార్టీకి హాజరైంది. జెనీలియా లేత బంగారు రంగు అద్దాలతో ఉన్న సల్వార్ సూట్లో మెరిసింది.ఆమె భర్త రితేష్ బ్లాక్ కుర్తా ధరించి క్యూట్‌గా కనిపించారు. షమితా శెట్టి లేత బంగారు రంగు డ్రెస్ ధరించి, వాటికి చోకర్‌తో జత చేసి, పాపరాజీలకు ఫోజులిస్తూ క్యూట్‌గా కనిపించింది. ఇక మలైకా అరోరాతో అర్బాజ్ ఖాన్ కుమారుడు అర్హాన్ ఖాన్ బ్లాక్ కుర్తా ధరించి అంకుల్ సల్మాన్ ఖాన్ ఈద్ పార్టీకి స్టైల్‌గా హాజరయ్యాడు.
సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ ఎరుపు రంగు సల్వార్ సూట్ ధరించి సల్మాన్ ఖాన్ ఈద్ పార్టీకి హాజరై ఫొటోలకి ఫోజులిచ్చింది.మొత్తానికి సల్మాన్ ఇంట జరిగిన ఈద్ బాష్కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ నటించిన సికందర్ చిత్రాన్ని మురుగదాస్ తెరకెక్కించగా, ఈ చిత్రం మార్చి 30న విడుదలైంది. తొలి రోజు ఈ చిత్రం ఇండియా వ్యాప్తంగా 30 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టగా, గ్లోబల్‌గా 50 కోట్లు రాబట్టినట్టు తెలుస్తుంది.