Salman Khan | బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వివాదాలతో వార్తలలో నిలవడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య సల్లూభాయ్ నుండి మంచి హిట్ అనేది రావడం లేదు. దాంతో ఫ్యాన్స్ డీలా పడ్డారు. మరోవైపు వివాదాలతో హాట్ టాపిక్ అవుతుండడం కూడా ఫ్యాన్స్‌ని కలవర పెడుతుంది. తాజాగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ కపిల్ శర్మ ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ సరికొత్త సీజన్ కి గెస్ట్‌గా హాజరయ్యాడు. చాలా రోజుల తర్వాత ఈ షో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధం కాగా, ఈ సీజన్లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఈ షోకు శాశ్వత అతిథిగా తిరిగి రావడం విశేషం. ఇక సల్మాన్ ఖాన్ షోలో పాల్గొనగా, ఇందుకు సంబంధించిన ఒక వీడియో క్లిప్ ఆన్లైన్లో ప్రత్యక్షమై అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేపుతోంది.
ఇందులో సల్మాన్ ఖాన్ ‘బీయింగ్ హ్యూమన్’ టీషర్ట్‌లో హాజరై, చాలా స్పష్టంగా కొన్ని వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా విడాకులు, సంబంధాల గురించి చెప్పిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకునేవారు. చిన్నచిన్న ఇబ్బందులు ఎదురైనా భరించేవారు. కానీ ఇప్పుడు ఓ చిన్న గొడవకే విడిపోతున్నారు. రాత్రి గురక పెడుతున్నాడన్నా, కాలు తాకిందన్నా విడాకులే .. అసలు విడాకుల తర్వాత సగం డబ్బులు కూడా తీసుకెళ్తున్నారు, అని చెప్పారు. ఈ మాటలు వినగానే కపిల్ శర్మ, అర్చనా పూరన్ సింగ్, సిద్ధూ అందరు తెగ నవ్వేసారు.
వారు నవ్విన దృశ్యాలు సోషల్ మీడియాలో పలు ఫ్యాన్ పేజీల ద్వారా షేర్ కాగా, దీనిపై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్ చేస్తున్నారు. సల్మాన్ ఎప్పుడూ స్పష్టంగా మాట్లాడతారు, మేధావిగా ప్రవర్తించరు, చాలా సింపుల్ గా ఏ విషయాన్నైన చెపుతారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఇది 100 శాతం నిజం, అని ఇంకొకరు కామెంట్ చేశారు. మరి కొందరు ఎప్పటి మాదిరిగానే సల్మాన్‌ని ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైన సల్మాన్ ఖాన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.