Pathaan v/s Tiger | దశాబ్దాలుగా హిందీ చిత్ర సీమలో రారాజుల కొనసాగుతున్న స్టార్లు సల్మాన్‌ఖాన్, షారుఖ్ ఖాన్. క్రేజ్ పరంగా, మార్కెట్ పరంగా వీళ్లని కొట్టేవారు లేరు. వీళ్ల సినిమాలు రిలీజవుతున్నాయంటే ఆ రోజు బాలీవుడ్లో పండగ వాతావరణం ఏర్పడుతుంది. అంతేకాదు బాలీవుడ్లో అత్యంత సన్నిహితులుగా వీరిరువురుని చెప్పుకుంటుంటారు. కాగా వీరిద్ధరి కలిసి సినిమా చేస్తే బావుంటుందని ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రేక్షకులు సైతం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. పఠాన్‌లో పది నిమిషాలు కనిపిస్తేనే థియేటర్లు ఊగిపోయాయి. కేవలం వీరిద్దరిని స్క్రీన్‌పై చూడాడానికి రీపీటెడ్గా ఆడియెన్స్ వచ్చారన్న వార్తలు కూడా అప్పుడు వినిపించాయి. అలాంటిది పూర్తి స్థాయిలో వీరిద్దరూ కలిసి నటిస్తే బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం ఖాయం.
ఇప్పుడదే ప్లాన్ చేస్తుంది యష్ రాజ్ ఫిలింస్ ప్రొడక్షన్ సంస్థ. అది కూడా ‘పఠాన్ వర్సెస్ టైగర్’ పేరుతో. తాజాగా యష్ రాజ్ ఫిలింస్ సంస్థ అధినేత ఆదిత్య చోప్రా ఆ ఇద్దరి అభిమానులను ఖుషీ చేసే అప్డేట్ను ప్రకటించారు. సల్మాన్, షారుఖ్ కలిసి సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. వీళ్ల కలయికలో తొలిసారి 1995లో ‘కరణ్ అర్జున్’ అనే రివేంజ్ డ్రామా సినిమాలో నటించారు. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో బంపర్ హిట్. ఆ తర్వాత ఎంత మంది దర్శక, నిర్మాతలు ఈ కాంబోను సెట్ చేయాలని ప్రయత్నాలు జరిపిన వర్కవుట్ అవ్వలేదు. మళ్లీ దాదాపు 28ఏళ్ల తర్వాత ఈ కాంబో కలిసి నటిస్తుంది. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్‌ను మొదలు పెట్టి ఆ తర్వాతి ఏడాది చివరి కల్లా సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
ఎన్నో ఏళ్ల తర్వాత షారుఖ్ ఇటీవలే ‘పఠాన్’తో తిరుగులేని విజయం సాధించాడు. ఏకంగా వెయ్యి కోట్ల మార్కు టచ్ చేసి హిందీ చిత్రసీమలో సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. ఇక ప్రస్తుతం షారుఖ్ నటించిన ‘జవాన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. దీనితో పాటు రాజ్‌కుమార్ హిరాణీతో ‘డుంకీ’ అనే సినిమా చేస్తున్నాడు. ఇక సల్మాన్ కూడా ప్రస్తుతం మూడు ప్రాజెక్ట్‌లను సెట్స్ మీద ఉంచాడు. అందులో ‘టైగర్-3’ విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా టైగర్-3లో షారుఖ్ గెస్ట్ రోల్ పోషిస్తున్నాడు.