Salaar | గెట్ రెడీ ప్రభాస్ ఫ్యాన్స్.. సలార్ వచ్చేస్తున్నాడు..!
Salaar | గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ కాంపౌండ్ నుంచి వచ్చిన చిత్రం సలార్ (Salaar). Salaar Part-1 Ceasefire ప్రపంచవ్యాప్తంగా 2023 డిసెంబర్ 22న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. పార్టు 1 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించగా.. ప్రభాస్ టీం మరోవైపు సీక్వెల్ షూట్‌కు రెడీ అవుతున్నారు.
Salaar | గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ కాంపౌండ్ నుంచి వచ్చిన చిత్రం సలార్ (Salaar). కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో రెండు పార్టులుగా తెరకెక్కుతుంది. Salaar Part-1 Ceasefire ప్రపంచవ్యాప్తంగా 2023 డిసెంబర్ 22న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. పార్టు 1 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించగా.. ప్రభాస్ టీం మరోవైపు సీక్వెల్ షూట్‌కు రెడీ అవుతున్నారు.
థియేటర్లను షేక్ చేసిన సలార్ డిజిటల్ ప్లాట్‌ఫాంలోనూ తన రేంజ్ ఏంటో చూపిస్తోంది. తాజాగా ఈ రెండు ప్లాట్‌ఫాంలలో సినిమా చూడని వారి కోసం గెట్ రెడీ అంటున్నాడు ప్రభాస్. సలార్ ఫైనల్‌గా టీవీల్లో సందడి చేయబోతుంది. సలార్ ఒరిజినల్ తెలుగు వెర్షన్ ఏప్రిల్ 21న స్టార్ మాలో సాయంత్రం 05:30 గంటల నుంచి ప్రీమియర్ కానుంది. ఇంకేంటి సలార్‌ను కుటుంససమేతంగా చూసేయండి మరి.
సలార్ పార్టు 1 ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లలో సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో కూడా సలార్ హవా కొనసాగించింది. నెట్‌ఫ్లిక్స్ ఇండియా చార్ట్స్‌లో సలార్ పార్టు 1 అత్యధిక వ్యూయర్షిప్తో నంబర్ 1 స్థానంలో నిలిచింది. తెలుగు, తమిళ్ వెర్షన్స్ టాప్ 2 స్థానాల్లో నిలువగా.. కన్నడ, మలయాళ వెర్షన్లు 5వ, 7వ స్థానంలో నిలిచినట్టు ఇప్పటికే అప్డేట్స్ వచ్చాయి.
సలార్ నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 గ్లోబల్ చార్ట్స్ (నాన్ ఇంగ్లీష్ కేటగిరి)లో మూడో స్థానంలో నిలవడం మరో విశేషం. ఓటీటీలో విడుదలైన తొలి వారంలోనే వరల్డ్‌వైడ్‌గా ఈ రేంజ్లో పాపులారిటీ అందుకున్న తెలుగు సినిమాగా టాప్‌లో నిలిచింది. సలార్‌లో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. జగపతి బాబు, మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్, బాబీ సింహా, ఈశ్వరీ రావు, శ్రియారెడ్డి, జాన్ విజయ్, సప్తగిరి, సిమ్రత్ కౌర్, పృథ్విరాజ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి రవి బస్రూర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.
The Telugu version of the recent Tollywood blockbuster and 2023’s highest-grossing South Indian flick, #SalaarCeaseFire, will premiere worldwide on April 21st at 5:30 PM on @StarMaa 🔥🔥🔥#Prabhas #Salaar pic.twitter.com/G56vWVHR0s
— Prabhas FC (@PrabhasRaju) April 14, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

