Maruthi | ఈ దర్శకుడి కూతురు మల్టీ టాలెంటెడ్..!
Maruthi | ఈ రోజుల్లో అనే చిన్న చిత్రంతో కెరీర్‌ను ప్రారంభించి ఆ చిత్రం సాధించిన సన్సేషన్తో అప్పట్లో సినీ పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా మారాడు దర్శకుడు మారుతి (Maruthi). తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో రాజాసాబ్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
Maruthi | ఈ రోజుల్లో అనే చిన్న చిత్రంతో కెరీర్‌ను ప్రారంభించి ఆ చిత్రం సాధించిన సన్సేషన్తో అప్పట్లో సినీ పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా మారాడు దర్శకుడు మారుతి (Maruthi). ఆ తరువాత దర్శకుడిగా భలే భలే మగాడివోయ్, ప్రతి రోజూ పండుగే, బాబు బంగారం వంటి కమర్షియల్ హిట్స్‌ను సాధించాడు. దీంతో పాటు పలు చిత్రాలకు కథా రచయితగా సమర్పకుడిగా కూడా ఆయన వ్యవహరించారు. తాజాగా మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో రాజాసాబ్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో వుంది. ఈ సినిమాలో ప్రభాస్ డిఫరెంట్ అవతార్‌లో కనిపించబోతున్నాడు. అయితే తాజాగా మారుతి తన సమర్పణలో జామ్ జంక్షన్ పక్కా రీజినల్ బ్యాండ్స్ బిగ్గెస్ట్ మ్యూజికల్ ఈవెంట్ సెప్టెంబర్ 6న హైటెక్స్ గ్రౌండ్లో జరగబోతుంది. ఇందులో బాగా ఇంప్రెస్ చేసిన వారికి అతని దర్శకత్వంలో రూపొందుతున్న ఓ చిన్న సినిమాకు మ్యూజిక్ చేసే చాన్స్‌తో పాటు క్యాష్ ప్రైజ్‌ను కూడా అనౌన్స్ చేశారు. ఇటీవల జరిగిన ఈ అనౌన్స్మెంట్ ఈవెంట్‌కు మారుతి కూతురు దాసరి హియ (Dasari Hiya) కూడా హాజరయ్యారు.
ఆమె కూడా ఈ జామ్ జంక్షన్ బ్యాండ్‌కు తండ్రితోపాటు వుండి సపోర్ట్ చేస్తున్నారు. అయితే మారుతి కూతురు దాసరి హియ కూడా మ్యూజికల్‌గా మంచి టాలెంటెడ్ అని తెలిసింది. దీంతో పాటు ఆమె ఫోటోగ్రఫీ, బొమ్మలు గీయడంలో కూడా ఎంతో ప్రతిభావంతురాలని సమాచారం. ఆమె ఫోటోగ్రఫీ ఫ్రేమ్స్ అండ్ ఆమె స్వయంగా గీసిన స్కెచెస్‌తో ఇప్పటి వరకు ఎన్నో ఎగ్జిబిషన్స్ నిర్వహించారట. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన దాసరి హియ మల్టీ టాలెంటెడ్ అంటున్నారు ఆమె గురించి తెలిసిన వాళ్లు. ఆమె ఆర్ట్స్ అండ్ మ్యూజిక్‌లో మరిన్ని సన్సేషన్స్ క్రియేట్ చేయాలని ఆశిద్దాం.
Read Also :
Vikramarkudu 4K | జక్కన్న విక్రమార్కుడు రీరిలీజ్ టైం.. రవితేజ కటౌట్ అదిరిందంతే
SK23 | మురుగదాస్-శివకార్తికేయన్ ఎస్కే 23 టీం ఇప్పుడెక్కడుందో తెలుసా..?
Skanda | యూట్యూబ్‌లో రామ్-బోయపాటి సునామి.. స్కందకు రికార్డు రెస్పాన్స్
Raayan Review | ధనుష్ రాయన్గా మెప్పించాడా.. పర్ఫెక్ట్ బెంచ్‌మార్క్ సినిమానా.. ?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pregnancy | 30 ఏళ్ల వయస్సులో గర్భం దాల్చడం కష్టమవుతుందా.. అండాల సంఖ్య తగ్గుతుందా..?
Bulgaria Accident | పొగమంచు ఎఫెక్ట్.. ఒకదానినొకటి ఢీకొన్న 86 వాహనాలు.. 12 మంది మృతి
Health Tips | వ్యాయామం చేసేటప్పుడు ఏదిపడితే అది తింటే ప్రమాదం.. ఎందుకో తెలుసా..?
ACB Case | ఏసీబీ వలలో భైంసా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్.. వీడియో
AP News | తీసుకున్న రూ.500 తిరిగివ్వలేదని ఓ వ్యక్తిపై వేడి నూనె గుప్పిన మహిళ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

