Salaar Trailer | పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న తెలుగు సినిమాల్లో ఒకటి సలార్ (Salaar). కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel), ప్రభాస్ (Prabhas) కాంబినేషన్లో యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న సలార్ రెండు పార్టులుగా రాబోతుండగా.. ఇప్పటికే విడుదల చేసిన Salaar Part-1 Ceasefire టీజర్ నెట్టింట వైరల్ అవుతూ.. మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది. ఇక ఈ చిత్రంలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ను ఎప్పుడు లాంఛ్ చేస్తారా..? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. అయితే ఈ ట్రైలర్ లాంఛ్ పై ఓ సాలిడ్ న్యూస్ బయటకు వచ్చింది.
సలార్ ట్రైలర్‌ను డిసెంబర్ 01న విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. కాగా దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్లో డార్క్షేడ్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే స్టన్నింగ్ విజువల్స్ మధ్య సలార్‌గా రెబల్ స్టార్ ప్రభాస్ ఎంట్రీ ఇస్తున్న సన్నివేశాలు ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రశాంత్ నీల్ ఈ సారి అంతర్జాతీయ మాఫియా చుట్టూ తిరిగే కథాంశంతో సలార్‌ను తెరకెక్కిస్తున్నాడట. అంతేకాదు ఇందులో ఓ ఇంటర్నేషనల్ యాక్టర్ కూడా నటిస్తున్నాడని వార్తలు వస్తుండగా.. దీనిపై హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ అండ్ మేకర్స్ టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
PRABHAS: ‘SALAAR’ NO POSTPONEMENT… TRAILER ON 1 DEC… #Salaar arrives in *cinemas* on 22 Dec 2023 #Christmas2023… Get ready for #SalaarTrailer.#Prabhas #PrithvirajSukumaran #PrashanthNeel #VijayKiragandur pic.twitter.com/L6KhQw8Tzk
— taran adarsh (@taran_adarsh) November 9, 2023
#Salaar Trailer is planning to be dropped on Dec 1st. Official Confirmation awaited.#PrashanthNeel is full confident on the product and all the team members are pumped up on #Prabhas Characterisation
Works going on in full swing..Movie arriving On Dec 22nd 2023 pic.twitter.com/wXRsKHXxXO
— Screen Score (@TheScreenScore) November 9, 2023
సలార్‌లో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న సలార్ పార్ట్-1 2023 డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక సలార్ పార్ట్-2 విడుదలపై క్లారిటీ రావాలంటే పార్టు 1 వరకు రిలీజయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.