Prabhas|కృష్ణంరాజు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రభాస్ తన క్రేజ్‌ని అమాంతం పెంచుకుంటున్నాడు. మధ్యలో కొన్ని ఫ్లాపులు పలకరించిన తర్వాత వరసగా హిట్స్ అందుకుంటున్నాడు. బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్.. సలార్, కల్కి సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకొని తన సత్తా ఏంటో నిరూపించాడు. ఇక ప్రభాస్ తన తర్వాతి సినిమాల లైనప్ చూస్తే దుమ్ము రేపడం ఖాయం. ప్రస్తుతం మారుతితో రాజా సాబ్ అనే సినిమా చేస్తున్న ప్రభాస్.. హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డితో ‘స్పిరిట్’.. సలార్ 2, కల్కి 2 చిత్రాలలో నటించనున్నారు.
ఇక ప్రభాస్ నటించిన సలార్ చిత్రం ఎంత పెద్ద హిట్టైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా భారీ యాక్షన్ డ్రామాగా రూపొంది ప్రభాస్ అభిమానులకి మంచి ఫీస్ట్ అందించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని మార్చి 21న రీరిలీజ్ చేయబోతున్నారట. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. పది అంటే పది నిమిషాల్లో థియేటర్లో నాలుగు షో టికెట్స్ సేల్ కావడం అందరిని ఆశ్చర్యపరిచింది. హైదరాబాద్ సిటీలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేటర్లలో సుదర్శన్ హాలులో సలార్ చిత్రం రీరిలీజ్ అవుతుంది. ఈ థియేటర్లో సినిమా చూడడం ఒక అనుభూతి మాదిరిగా ఉంటుంది. అందులో ప్రభాస్ సినిమా చూస్తే ఆ థ్రిల్లే వేరు. అందుకే జనాలు సలార్ సినిమా రీరిలీజ్ చూసేందుకు ఎగబడుతున్నారు. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్న విషయం తెలిసిందే . ఒక వైపు మారుతి దర్శకత్వం వహిస్తున్న ‘ది రాజా సాబ్’ చిత్రీకరణలో పాల్గొంటూనే మరొక వైపు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఫౌజీ షూటింగ్ పూర్తి చేస్తున్నాడు. కొన్ని రోజులు ఒక సినిమా ఇంకొన్ని రోజులు వేరే సినిమా చేస్తున్నాడు. ఇవి రెండు పూర్తయ్యాక సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమా చేయనున్నట్టు తెలుస్తుంది. అయితే స్పిరిట్ సినిమా చేసే సమయంలో సందీప్ పూర్తిగా ప్రభాస్‌ని లాక్ చేయనున్నాడు. ఇక ఈ మూవీ తర్వాతే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ సీక్వెల్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ చేయనున్నాడని అంటున్నారు.