Salaar Movie Bookings | సలార్‌పై ప్రభాస్ ఫ్యాన్స్‌లో మాములు అంచనాల్లేవు. పక్కా రికార్డులు కొల్లగొడుందని దీమాగా ఉన్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు తిరుగులేని రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్ కు ఆదిపురుష్ చేసిన గాయానికి అసలు సిసలైన మందు సలారే ఫ్యాన్స్ బల్ల గుద్ది చెబుతున్నారు. కోడికూత వినకముందే టీజర్ రూపంలో సలార్ ఊచకోతను చూపించి ప్రభాస్ అభిమానులను ఆనందపు అంచుల్లో నిలబెట్టాడు ప్రశాంత్ నీల్. జురాసిక్ పార్కులో డైనోసర్ ముందు ఏదైనా దిగదుడుపే అన్న రేంజ్లో ప్రభాస్‌కు ఎలివేషన్ ఇవ్వడం వేరే లెవల్. ఒక్క టీజర్‌తో యావత్ సినీ అభిమానుల్లో తిరుగులేని అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక వచ్చే నెలలో ట్రైలర్ కూడా రిలీజ్ కాబోతుందని అప్పుడే ప్రకటన కూడా ఇచ్చేశారు.
ఇదిలా ఉంటే తాజాగా యూఎస్ఏలో ఈ సినిమా బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. బుకింగ్స్ స్టార్ట్ అయిన కొద్ది గంటల్లోనే అడ్వాన్స్ సేల్స్‌తో $100,000(రూ.87.07 లక్షలు) కొల్లగొట్టాయి. దీన్ని బట్టి చూస్తే సలార్ తొలిరోజు ఊహించని రేంజ్లో యూఎస్ బాక్సాఫీస్ దగ్గర నెంబర్స్ క్రియేట్ చేసేలా కనిపిస్తుంది. అంతేకాకుండా ఎప్పుడూ లెనంత ఎక్కువ థియేటర్లో సలార్ రిలీజ్ కాబోతుంది. బయటకు వినిపించట్లేదు కానీ ఓ రేంజ్లో ఈ సినిమాకు బిజినెస్ జరుగుతుందని తెలుస్తుంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే సలార్ బిజినెస్ లెక్కలు రెండొందల కోట్లు దాటుతున్నాయని ఇన్ సైడ్ టాక్.
రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సలార్ సినిమా ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. సలార్ సినిమాను ఇంగ్లీష్ భాషలోనూ రిలీజ్ చేసేలా గట్టి ప్రయత్నాలే చేస్తుందట హోంబలే సంస్థ. అంతేకాకుండా విెదేశాల్లో పెద్ద ఎత్తున ఈ సినిమా రిలీజ్‌ను ప్లాన్ చేస్తున్నారట. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం ప్యాచ్ వర్క్‌ను పూర్తి చేసుకుంటుంది. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతిహాసన్ నటిస్తుంది. మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు.
Just IN:#Salaar CROSSES $100,000 [₹83.07 lacs] mark at the USA🇺🇸 Box Office from just advance sales.
||#Prabhas|#SalaarCeaseFire|| pic.twitter.com/fU9ykMixiM
— Manobala Vijayabalan (@ManobalaV) August 22, 2023