Salaar Movie making Video |టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas), మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘సలార్’ (Salaar). శ్రుతిహాసన్ కథానాయికగా నటించింది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకురాగా.. బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ నటన మూవీకే హైలైట్ అని అభిమానులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ‘సలార్ సీజ్ఫైర్’ మేకింగ్ వీడియోను చిత్రబృందం సోషల్ మీడియాలో విడుదల చేసింది. ‘మేకింగ్ వీడియో ఆఫ్ సలార్ సీజ్ఫైర్’ (The Journey Of Golden Star Japan) పేరిట ఈ వీడియో విడుదల చేయగా.. ‘సీజ్ఫైర్’ను తీర్చిదిద్దడంలో టీమ్ చేసిన హార్డ్ వర్క్ కనిపిస్తుంది. ఇక సినిమాలో హైలైట్గా నిలిచిన పలు సన్నివేశాలను ఈ వీడియోలో చూడవచ్చు. మరోవైపు ప్రభాస్ స్టైలిష్గా ఇదివరకెన్నడూ కనిపించని మాస్ లుక్లో పక్కా ఎంటర్టైన్ మెంట్ అందించినట్లు తెలుస్తుంది.