Salaar Dubbing | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న తాజా చిత్రం సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ (Salaar: Part 1 – Ceasefire) కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో రానున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 22న విడుదల కానుంది. మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.
ఈ సినిమాలో తన పాత్రకు (వరద రాజ మన్నార్) డబ్బింగ్ పూర్తి చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఈ సందర్భంగా సలార్ మూవీలో తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేశానని తెలుపుతూ.. ట్విట్టర్లో ఓ స్పెషల్ పోస్ట్ పెట్టాడు.
‘సలార్ ఫైనల్ డబ్బింగ్ కరెక్షన్స్ పూర్తయ్యాయి. నేను గత కొన్ని సంవత్సరాలుగా నుంచి వివిధ భాషలలో పనిచేస్తున్నాను.. నా పాత్రలన్నింటికీ నేనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటాను. అయితే ఒకే క్యారెక్టర్‌కి ఒకే సినిమాలో 5 భాషల్లో డబ్బింగ్ చెప్పడం నాకు ఫస్ట్ టైం ఇది. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి డబ్బింగ్ చెప్పాను. ఇది చేయడానికి తగిన మూవీ. డిసెంబర్ 22, 2023న ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో దేవా, వరద మిమ్మల్ని కలుసుకోవడానికి వస్తున్నారు. మీరంతా వచ్చేయండి’ అంటూ పృథ్వీరాజ్ రాసుకోచ్చాడు.
#Salaar Final dubbing corrections done. I have had the privilege of lending my own voice for all my characters across various languages I’ve worked in over the years. I have even dubbed for some of my characters in multiple languages. But to be dubbing for the same character, in… pic.twitter.com/RmMZZ9EF72
— Prithviraj Sukumaran (@PrithviOfficial) December 10, 2023