Salaar Molvie | ఎట్టకేలకు సలార్ సినిమాపై ఫ్యాన్స్‌కు ఓ క్లారిటీ వచ్చేసింది. అప్పుడొస్తుంది. ఇప్పుడొస్తుందంటూ వస్తున్న రూమర్స్‌కు చెక్ పడింది. డిసెంబర్ 22న షారుఖ్ డుంకీతో తలపడడానికి రెడీ అయింది. ఎప్పుడొచ్చినా పక్కా రికార్డులు కొల్లగొడుందని అభిమానులు ధీమాగా ఉన్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు తిరుగులేని రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్ కు ఆదిపురుష్ చేసిన గాయానికి అసలు సిసలైన మందు సలారే అని ఫిక్సయిపోయారు. జురాసిక్ పార్కులో డైనోసర్ ముందు ఏదైనా దిగదుడుపే అన్న రేంజ్లో ప్రభాస్‌కు ఇచ్చిన ఎలివేషన్ నుంచి అభిమానులు ఇప్పటికీ బయటకు రాలేకపోతున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ లెక్కలు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.
ఇండియన్ సినిమా హిస్టరీలోనే కనీవినీ ఎరుగని రేంజ్లో ఈ సినిమాకు బిజినెస్ జరుగుతున్నట్లు ఇన్సైడ్ టాక్. కేవలం డిజిటల్, శాటిలైట్ హక్కులు అన్ని భాషలకు కలుపుకుని దాదాపు రూ.350 కోట్లు రేటు పలికాయని తెలుస్తుంది. ఇంత పెద్ద మొత్తంలో ఓ సినిమాకు బిజినెస్ జరగడం అంటే ఆశా మాశీ కాదు. కేవలం నాన్-థియేట్రికల్ హక్కులకే ఈ రేంజ్లో బిజినెస్ జరుగుతుందంటే థియేట్రికల్ బిజినెస్ ఇంకెంత స్థాయిలో జరుగుతుందోనని అప్పుడే ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్నారు.
రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సలార్ సినిమా ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమాను ఇంగ్లీష్ భాషలోనూ రిలీజ్ చేసేలా గట్టి ప్రయత్నాలే చేస్తుందట హోంబలే సంస్థ. అంతేకాకుండా విెదేశాల్లో పెద్ద ఎత్తున ఈ సినిమా రిలీజ్‌ను ప్లాన్ చేస్తున్నారట. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం ప్యాచ్ వర్క్‌ను పూర్తి చేసుకుంటుంది. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతిహాసన్ నటిస్తుంది. మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు.