న్యూఢిల్లీ : రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబోలో విడుదలై తొలిరోజు వసూళ్ల సునామీతో చెలరేగిన సలార్ రెండో రోజు కలెక్షన్స్ (Salaar Box Office Collection Day 2) కొంత తగ్గుముఖం పట్టినా మొత్తం వసూళ్లు రూ. 150 కోట్లకు చేరువయ్యాయి. పృధ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్ ఇతర ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ఈ మూవీ భారత్‌లో భారీ వసూళ్ల దిశగా సాగుతూ ప్రభాస్‌కు కమ్‌బ్యాక్ మూవీగా నిలిచింది.
సలార్ రెండో రోజు దేశవ్యాప్తంగా రూ. 55 కోట్లు వసూలు చేసి రెండు రోజులకు గాను భారత్‌లో రూ. 145.70 కోట్ల వసూళ్లు రాబట్టింది. త్వరలోనే సలార్ దేశీ వసూళ్లు రూ. 200 కోట్ల మైలురాయిని అధిగమిస్తాయని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి.
సలార్ తొలి రోజు దేశవ్యాప్తంగా ఏకంగా రూ. 95 కోట్లు కలెక్ట్ చేసి ఈ ఏడాది టాప్ వన్ బిగ్గెస్ట్ ఓపెనర్‌గా రికార్డు సృష్టించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా సలార్ రెండు రోజులకు ఏకంగా రూ. 175 కోట్లు పైగా రాబట్టి బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకెళుతోంది.
Read More :
Snowfall | చలిగుప్పిట ఉత్తర భారతం.. జమ్మూ కశ్మీర్లో హిమపాతం