Salaar | చాలా రోజుల తర్వాత ప్రభాస్ నటించిన సలార్ మరోసారి నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ సారి మాత్రం రొటీన్‌గా కాకుండా కొంచెం కొత్తగా టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా నిలుస్తోంది. దీనిక్కారణం ఏంటనుకుంటున్నారా..? ఇటీవలే కొత్త హాలీవుడ్ సినిమా ది లాస్ట్ బస్ ప్రోమో విడుదలైంది. అయితే ఈ ప్రోమో చూసిన కొందరు నెటిజన్లు సలార్ కాపీ అంటూ నెట్టింట ట్రోల్స్ మొదలుపెట్టారు. ఇంతకీ ఈ మూవీలో ఏం కాపీ చేశారనే కదా మీ డౌటు.
కంటెంట్ అయితే కాదు కానీ నెటిజన్ల టాక్ ప్రకారం సలార్‌లోని బీజీఎంను కాపీ చేశారని కామెంట్స్ ఊపందుకున్నాయి. ప్రశాంత్ నీల్ యాక్షన్ డ్రామా ప్రాజెక్టుకు రవి బస్రూర్ అదిరిపోయే బీజీఎం అందించాడని తెలిసిందే. సినిమా సక్సెస్‌లో ఈ బీజీఎం కీ రోల్ పోషించిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
హాలీవుడ్ సినిమా ది లాస్ట్ బస్‌లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ను వింటే 1:13 (నిమిషాల నిడివి నుంచి) సలార్ బీజీఎంలాగే ఉంటుందని ఓ నెటిజన్ కామెంట్ పోస్ట్ చేశాడు. సౌతిండియన్ సినిమా ప్రభావం చాలా పడిందని.. ఎంతలా అంటే హాలీవుడ్ కూడా మన దగ్గర నుంచి కాపీ చేసుకునేలా అంటూ చాలా మంది మూవీ లవర్స్ చర్చించుకోవడం మొదలుపెట్టారు.
ఇదిలా ఉంటే ది లాస్ట్ బస్ ప్రమోషనల్ ప్రోమోలో కంపోజర్ ఎవరనేది చూపించకపోవడం గమనార్హం. ఇక ఈ విషయమై మాత్రం అటు సలార్ టీం నుంచి కానీ.. ఇటు ది లాస్ట్ బస్ టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన బయటకు రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం కామెంట్స్, ట్రోల్స్ వర్షం కురుస్తుంది. మరి దీనిపై మేకర్స్ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.
NTR | ‘వార్ 2’ ఫ్లాప్‌తో ఎన్టీఆర్ హిందీ కెరీర్ ముగిసింది?.. కమల్ ఆర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్!
Deepika Padukone | పనిగంటల వివాదం.. తొలిసారి స్పందించిన దీపికా పదుకొణే