Hari Hara Veera Mallu | అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన హరిహర వీరమల్లు చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బుధవారం నుంచే ప్రీమియర్స్ స్టార్ట్ అవ్వడంతో అభిమానులు పండగా చేసుకుంటున్నారు. ఒకవైపు సినిమా విడుదలై అభిమానులు సంబరాలు చేసుకుంటుంటే వారికి మరొ తీపికబురుని అందిస్తూ మూవీ నుంచి ‘సలసల మరిగే నీలోని రక్తమే’ (Salasala Marige) అనే పవర్ఫుల్ లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించగా.. సాయిచరణ్ భాస్కరుని, లోకేశ్వర్, పీవీఎన్ఎస్ రోహిత్ తదితరులు కలిసి ఆలపించారు. ఎం.ఎం కీరవాణి సంగీతం అందించాడు.