Actress Sakshi Vaidhya | అదేంటో ఒక్కోసారి ఎన్ని సినిమాలు చేసిన కొందరు హీరోయిన్లకు స్టార్ హీరోలతో సినిమా చేయలనేది అందని ద్రాక్షలా మారుతుంది. అదే కొందరి విషయంలో మాత్రం ఒకటీ రెండు సినిమాలకే టాప్ హీరోలతో సినిమా చేసే చాన్స్ పట్టేస్తారు. కాగా తాజాగా ఏజెంట్ బ్యూటీ సాక్షీ వైద్య అలాంటి జాక్ పాటే కొట్టిసింది. నిజానికి సాక్షీ సినిమాల్లోకి రావడమే యాదృచ్చికం. దర్శకుడు సురేందర్ రెడ్డి, సాక్షీ ఇన్‌స్టా రీల్స్ చూసి ఆమెను ఆడిషన్‌కు పిలిచాడట. కట్ చేస్తే అఖిల్ పక్కన హీరోయిన్గా నటించింది. సినిమా పెద్దగా ఆడకపోయినా.. సాక్షీకి మాత్రం మంచి పేరు వచ్చింది. ఇక మరో రెండు రోజుల్లో రిలీజయ్యే గాండీవధారి అర్జునలో కూడా సాక్షీనే హీరోయిన్. టీజర్, ట్రైలర్లు గట్రా చూస్తుంటే సాక్షీకు పవర్ ఫుల్ రోల్ పడ్డట్లే తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ బ్యూటీ తాజాగా పవన్ కళ్యాణ్ పక్కన నటించే చాన్స్ పట్టేసిందట. ఎన్నో నెలలుగా చర్చలు జరుగుతున్న ఉస్తాద్‌లో ఈమె కీలకం కానున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు కావాల్సిఉండగా.. సెకండ్ హీరోయిన్గా సాక్షీ వైద్యను తీసుకోబోతున్నారట. ఇక మెయిన్ లీడ్‌గా శ్రీలీల నటిస్తుంది. తేరీ రీమేక్ అంటూ గతంలో ప్రచారం వచ్చినా.. ఎప్పటికప్పుడు ఆ వార్తలను హరీష్ శంకర్ ఖండిస్తూనే వస్తున్నాడు. అయినా కానీ ఈ సినిమా లీక్స్‌ను బట్టి చూస్తే అది తేరీనే అని స్పష్టంగా తెలుస్తుంది. అయితే అందులో కోర్ పాయింట్ మాత్రమే హరీష్ తీసుకుని.. తన స్టైల్ ఆప్ మేకింగ్‌తో సినిమాను సిద్దం చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఉస్తాద్.. రెండో షెడ్యూల్ కోసం రెడీ అవుతుంది. ముందుగా సంక్రాంతిని టార్గెట్ చేసినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ డేట్స్ అడ్జెస్ చేయడం కష్టం. దాంతో సినిమాను సమ్మర్‌కు ప్లాన్ చేస్తున్నారట. మైత్రీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చుతున్నాడు. ఇక గద్దలకొండ గణేష్ తర్వాత హరీష్ నుంచి ఇప్పటివరకు సినిమా రాలేదు.