Saiyaaara Movie | బాలీవుడ్లో చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం సైయారా (Saiyaara). ఈ సినిమాకు మోహిత్ సూరి దర్శకత్వం వహించగా.. ఆహాన్ పాండే, అనిత్ పడ్డా హీరో హీరోయిన్లుగా నటించారు. ఆషిఖీ 2, ఎక్ విలన్ వంటి బ్లాక్ బస్టర్ల తర్వాత మోహిత్ సూరి దర్శకత్వంలో ఈ సినిమా రావడంతో మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే జూలై 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. మొదటిరోజు నుంచే భారీ కలెక్షన్లు రాబడుతున్న ఈ చిత్రం తాజాగా రూ.581 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టినట్లు చిత్రబృందం యష్‌రాజ్ ఫిలిమ్స్ ప్రకటించింది. ఈ సందర్భంగా సరికొత్త రికార్డును అందుకుంది. లవ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చి అత్యధిక కలెక్లన్లు సాధించిన చిత్రంగా ఈ సినిమా నిలిచింది. కేవలం ఇండియాలోనే రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించగా.. వరల్డ్ వైడ్‌గా రూ.169 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. మరోవైపు ఈ సినిమా ఓటీటీ కోసం ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
The #Saiyaara wave is unstoppable, thanks to YOU 💓💓💓
Watch it today, book tickets now – https://t.co/T2QGBqhOgp | https://t.co/9iUzCKlf0w #AhaanPanday | #AneetPadda | @mohit11481 | #AkshayeWidhani pic.twitter.com/n7vGaQbdsm— Yash Raj Films (@yrf) September 2, 2025