ఆషికి-2, మలంగ్, ఏక్ విలన్ వంటి ప్రేమకథా చిత్రాల్ని రూపొందించిన దర్శకుడు మోహిత్ సూరి తాజా చిత్రం ‘సయారా’. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్‌రాజ్ ఫిల్మ్స్ తెరకెక్కిస్తున్నది. అనీత్ పద్దా కథానాయికగా నటిస్తున్నది. ఈ సినిమా నుంచి ‘బర్బాద్..’ అనే ప్రేమగీతాన్ని విడుదల చేశారు. దిరిష్ స్వరకల్పన చేస్తూ సాహిత్యాన్ని అందించాడు. జుబిన్ ఆలపించారు. ఈ సినిమా గురించి దర్శకుడు మోహిత్సూరి మాట్లాడుతూ ‘న్యూఏజ్ లవ్‌స్టోరీ ఇది. నేటి యువత మనోభావాలకు అద్దంపట్టేలా ఉంటుంది.
సంగీతభరిత ప్రేమకథా చిత్రంగా మెప్పిస్తుంది. ‘బర్బాద్..’ పాటలో లోతైన భావాలున్నాయి. ప్రేమికుల గొప్పదనాన్ని చాటుతూ, ప్రణయబంధంలోని మాధుర్యాన్ని తెలియజేస్తుంది. ఓ హృద్యమైన ప్రేమకథగా ‘సయారా’ అందరిని మెప్పిస్తుంది’ అన్నారు. జూలై 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.