A.R. Rahman | ఆస్కార్ అవార్డు విజేత, దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం లండన్ నుంచి చైన్నైకు వచ్చిన ఆయనకు ఛాతీ నొప్పితో ఇబ్బందిపడ్డట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆ వార్తలను ఆయన కుటుంబసభ్యులు ఖండిస్తూ.. రెహమాన్ డీహైడ్రేషన్, మెడ నొప్పి వలన ఆస్పత్రికి వెళ్లారని స్పష్టం చేసింది. రంజాన్ మాసం కారణంగా ఉపవాసం ఉండడంతో డీహైడ్రేషన్ గురయినట్లు తెలిపింది. రెహమాన్ ఆరోగ్యం స్థిరంగా ఉండడంతో అతడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశామంటూ వైద్యులు వెల్లడించారు. అయితే రెహమాన్ ఆసుపత్రిలో చేరారని సమాచారం తెలుసుకున్న ఆయన అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు అతడిని సోషల్ మీడియా వేదికగా త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.
ఇదిలావుంటే.. రెహమాన్ మాజీ భార్య సైరా బాను తాజాగా అతడు ఆస్పత్రిలో చేరడంపై స్పందించింది. నేను అతడు (రెహమాన్) త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. అతనికి గుండె నొప్పి వచ్చి, ఆంజియోప్లాస్టీ చేయించుకున్నాడనే వార్తలు నాకు వినిపించాయి. దేవుడి దయవలన రెహమాన్ ఇప్పుడు బాగున్నాడు. అలాగే ఒక విషయంపై మేం క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాము. రెహమాన్ నేను విడిపోలేదు. మేము భార్యాభర్తలుగా కలిసే ఉంటున్నాము. గత కొన్ని సంవత్సరాలుగా నా ఆరోగ్యం బాగాలేకపోవడంతో అతడిని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక విడిపోదాం అని నిర్ణయించుకున్నాం. అంతే తప్ప మా మధ్య ఎలాంటి గొడవలు జరుగలేదు. అలాగే మీడియాకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్న నన్ను ఇకనుంచి అయిన నన్ను అతని మాజీ భార్య అని పిలవవద్దని కోరుతున్నాను అంటూ సైరా భాను చెప్పుకోచ్చింది.