Saindhav | టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ (Venkatesh) నటిస్తున్న తాజా చిత్రం సైంధవ్ (SAINDHAV). యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘హిట్’ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. వెంకట్ బోయనపల్లి నిర్మాత. వెంకటేష్ నటిస్తున్న 75వ చిత్రమిది కావడం విశేషం. ఆయన కెరీర్లో అత్యధిక బడ్జెట్‌తో భారీ యాక్షన్ హంగులతో రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు, టీజర్ విడుదల చేసిన చిత్రబృందం తాజాగా మ్యూజికల్ అప్డేట్ను ఇచ్చింది.
దీపావళి కానుకగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. రాంగ్ యూసేజ్ (Wrong Usage) అంటూ సాగే ఈ ఫస్ట్ సింగిల్‌ను నవంబర్ 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీనితో పాటు దీపావళి పండగా సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది.
Wishing everyone a sparkling Diwali❤️
Kick starting the celebrations with #SAINDHAV First single #WrongUsage on NOV 21st 🎶❤️🔥#SaindhavOnJAN13th 💥
Victory @VenkyMama @Nawazuddin_S @arya_offl @KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @andrea_jeremiah @Music_Santhosh… pic.twitter.com/6Xul1Gunlf
— Vamsi Kaka (@vamsikaka) November 12, 2023
ఇక సౌత్ ఇండియాలోని చంద్రప్రస్థ అనే ఫిక్షనల్ పోర్ట్ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉండనుంది. సైంధవ్‌లో శ్రద్ధా శ్రీనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, జయప్రకాశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నవాజుద్దీన్ సిద్దిఖీకి టాలీవుడ్ డెబ్యూ కావడం విశేషం. మేకర్స్ ఇప్పటికే పాత్రలను పరిచయం చేస్తూ విడుదల చేసిన శ్రద్ధా శ్రీనాథ్ మనోజ్ఞ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.