Salaar Movie | ఫ్యాన్స్‌కు ఏమో కానీ.. సలార్ రిలీజ్ మాత్రం కొత్త సినిమాలకు లేని పోని చిక్కులు తెచ్చిపెడుతుంది. సెప్టెంబర్ 28 అంటూ ఏడాది కిందటే సలార్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయడంతో.. ఎన్నో సినిమాలు దీనికి దరిదాపుల్లో కూడా రాకూడదని ప్లాన్ చేసుకున్నాయి. తీరా రిలీజ్ పోస్ట్ పోన్ అవడంతో గంపగుత్తగా షూటింగ్ పూర్తిచేసుకున్న సినిమాలన్ని సలార్ నెలలో ఖర్చీఫ్‌లు వేసుకున్నాయి. ఇక ఇప్పుడు కొత్తగా డిసెంబర్ 22న సలార్ రిలీజవుతుందని వార్తలు రావడంతో అప్పటికే క్రిస్మస్ స్లాట్‌ను బుక్ చేసుకున్న మీడియం బడ్జెట్ సినిమాలు గందరగోళంలోకి వెళ్లిపోయాయి.
ముందుగా క్రిస్మస్పై ఖర్చీఫ్ వేసిన సినిమా హాయ్ నాన్న. నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమాను శౌర్యువ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. కాగా ఈ సినిమా ప్రకటించినప్పుడు క్రిస్మస్ రిలీజ్ అని మేకర్స్ వెల్లడించారు. అదే దిశగా షూటింగ్‌ను కూడా శరవేగంగా జరుపుతున్నారు. కానీ ఇప్పుడు సలార్ రాకతో మేకర్స్‌లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇక దీనితో పాటుగా క్రిస్మస్ వీక్‌లో స్లాట్ బుక్ చేసుకున్న మరో సినిమా సైంధవ్. విక్టరీ వెంకటేష్ నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు సైలేష్ కొలను దర్శకుడు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, పోస్టర్లు జనాల్లో మాములు అంచనాలు క్రియేట్ చేయలేవు.
పైగా నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, ఆండ్రియా వంటి స్టార్ కాస్ట్ సినిమాలో భాగం కావడంతో జనాల్లో ఎక్కడలేని క్యూరియాసిటీ క్రియేట్ అయింది. కాగా ఈ సినిమా డిసెంబర్ 22న వస్తున్నట్లు నెల కిందటే ప్రకటించింది. పోటీగా షారుఖ్ డుంకీ, హాయ్ నాన్న వంటి సినిమాలున్నా.. కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. అయితే ఇప్పుడు డైనసర్ రాకతో ఈ సినిమాక పోస్ట్ పోన్ తిప్పలు తప్పేలా లేవు. ఎంత కంటెంట్ సినిమా అయినా సరే.. సలార్‌కి ఎదురెళ్లడం రిస్కే. ఈ క్రమంలో సైంధవ్ టీమ్ ప్లాన్-బీని అమలు చేసుకునే పనిలో ఉందట.
ఒకవేళ సలార్ డిసెంబర్ 22నే వస్తే సైంధవ్ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. పోటీగా గుంటూరు కారం, హనుమాన్, రవితేజ ఈగల్ వంటి సినిమాలున్నా.. సంక్రాంతి కాబట్టి ఈజీగా గట్టెక్కేయోచ్చు అని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. ఇక నితిన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ కూడా క్రిస్మస్ వీక్నే టార్గెట్‌గా పెట్టుకుంది. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ముప్పావు శాతం షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమా పరిస్థితేంటో అస్సలు క్లారిటీ లేదు.
ఇక ఏడాది కిందటే డేట్‌ను కన్ఫర్మ్ చేసుకున్న డుంకీ పరిస్థితి కూడా ఏటు తేలకుండా ఉంది. షారుఖ్ హీరో కాబట్టి నార్త్‌లో రఫ్పాడిస్తాడు. కానీ సౌత్‌లో పెద్దగా మార్కెట్ లేదు. బాలీవుడ్లో వందల కోట్లు కోట్లు కొల్లగొడుతున్న జవాన్‌కు .. దక్షిణాదిలో అన్ని వుడ్లు కలిపినా వంద కోట్ల షేర్ రాలేదు. అలాంటి టైమ్‌లో సలార్‌తో పోటీ అంటే డుంకీకి సవాలే. చూడాలి మరి చివరికి ఏమవుతుందో.