తొలి సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి’తో ఘన విజయాన్ని అందుకున్న దర్శకుడు సాయిలు కాంపాటి దర్శకత్వంలో రెండో సినిమాకు రంగం సిద్ధమైంది. ‘మేమ్ ఫేమస్’ సినిమాతో ఫేమస్ అయిన సుమంత్ ప్రభాస్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించనున్నట్టు సమాచారం. ఏషియన్ సునీల్, పుస్కూర్ రామ్మోహన్రావు, భగత్ నారంగ్ కలిసి నిర్మించనున్న ఈ చిత్రానికి ‘బబ్లూ XXL’ అనే విభిన్నమైన టైటిల్‌ని పరిశీలిస్తున్నట్టు టాక్ వినిపిస్తున్నది. కథానుగుణంగానే ఈ టైటిల్ అనుకుంటున్నారట. నిజానికి ‘రాజు వెడ్స్ రాంబాయి’లోనే సుమంత్ప్రభాస్ హీరోగా నటించాలి. కానీ కొన్ని కారణాల వల్ల కుదర్లేదు. ఇప్పుడు సాయిలు చెప్పిన కథ నచ్చడంతో సుమంత్ప్రభాస్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని వినికిడి. తెలంగాణ నేటివిటీతో, సహజమైన ఎమోషన్స్‌తో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయిందట. త్వరలోనే టైటిల్‌తో కూడిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.