ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై దాడికి పాల్పడిన దుండగుడు ఇంకా పరారీలో ఉన్నాడు. అతని కోసం ముంబై పోలీసు శాఖకు చెందిన 30 బృందాలు ఇంకా గాలిస్తున్నాయి. సైఫ్‌పై దాడితో అండర్వరల్డ్కు లింకు లేదని ఆ రాష్ట్ర మంత్రి పేర్కొన్నారు. అటాకర్ ఎటువంటి క్రిమినల్ గ్యాంగ్‌కు పనిచేయడం లేదన్నారు. అసలు ఎవరి ఇంట్లోకి ఎంటర్ అయ్యాడన్న విషయంలో కూడా ఆ వ్యక్తికి క్లారిటీ ఉండకపోవచ్చు అని పోలీసులు తెలిపారు.
సైఫ్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తి తరహాలో ఉన్న ఓ కార్పెంటర్‌ను అదుపులో తీసుకున్నారు పోలీసులు. బాంద్రా పోలీసు స్టేషన్లో అతన్ని విచారించిన తర్వాత రిలీజ్ చేశారు. ఖాన్‌పై జరిగిన అటాక్‌తో అతనికి సంబంధం లేదన్నాడు. ఈ కేసులో ఇప్పటి వరకు ఎవర్నీ అరెస్టు చేయలేదన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి ఫోటో సీసీటీవీ పూటేజ్కు చిక్కింది.
సైఫ్ అలీఖాన్ ఉండే సద్గురు శరన్ అపార్ట్మెంట్లోకి ఆ రోజు తెల్లవారుజామున 2.30 నిమిషాలకు ఓ వ్యక్తి ముఖానికి ఎరుపు రంగు స్కార్ఫ్ పెట్టుకుని మెట్ల మార్గంలో బిల్డింగ్ ఎక్కినట్లు పోలీసులు చెప్పారు. దొంగతనం చేయాలన్న ఉద్దేశంతోనే ఆ వ్యక్తి సైఫ్ ఇంట్లోకి ప్రవేశించినట్లు మహారాష్ట్ర మంత్రి యోగేశ్ కడమ్ తెలిపారు.
కత్తి దాడితో అండర్‌వరల్డ్ లింక్ లేదన్నాడు. ప్రస్తుతం సైఫ్ లీలావతి ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. మరో రెండుమూడు రోజుల్లో అతన్ని డిశ్చార్జ్ చేయనున్నారు.