Saif Ali Khan – Taimur | బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. సైఫ్ అలీఖాన్‌పై జనవరి 16న దాడిన జరిగిన విషయం తెలిసిందే. బాంద్రాలోని నటుడి నివాసంలో చోరీకి వచ్చిన దుండగుడు సైఫ్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో నటుడిని కుటుంబ సభ్యులు లీలావతి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడ వైద్యులు సైఫ్‌కు శస్త్ర చికిత్స చేశారు. ఇటీవలే డిశ్చార్జ్ అయిన సైఫ్.. ప్రస్తుతం కోలుకుంటున్నారు. మరోవైపు ఈ దాడి ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
అయితే తనపై దాడి ఘటనకు సంబంధించి తొలిసారి స్పందించారు సైఫ్ అలీఖాన్. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న సైఫ్ ఈ ఘటనపై స్పందిస్తూ.. నాపై దాడి తర్వాత నా కుర్తా అంతా రక్తంతో తడిచిపోయింది. దీంతో నా భార్య కరీనా ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఆటో లేదా క్యాబ్ కోసం ట్రై చేస్తుంది. అయితే రక్తంతో తడిచిన నన్ను చూసిన తైముర్ నా దగ్గరికి వచ్చి నువ్వు చనిపోతున్నావా నాన్న అని అడిగాడు. అప్పుడు నేను లేదు అని చెప్పాను. ఆ తర్వాత నాతో కలిసి ఆసుపత్రికి వచ్చాడు. నేను తైముర్ని ఆసుపత్రికి తీసుకువెళ్లడం ఎందుకని ఆలోచించాను. కానీ వాడు రావాడం నేను ఒంటరిగా లేను అనే ఫీలింగ్‌ను ఇచ్చిందంటూ సైఫ్ చెప్పుకోచ్చాడు.