Saif Ali Khan | బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) తాజాగా ఓ లగ్జరీ ఇల్లును కొనుగోలు చేశాడు. అరబ్ దేశమైన ఖతార్‌లో తన కొత్త బంగ్లాను కోనుగోలు చేశాడు. దేశ రాజధాని అయిన దోహలోని ది సెయింట్ రెజిస్ మార్సా అరేబియా ఐలాండ్‌లోని ది పెరల్లో ఒక విలాసవంతమైన లగ్జరీ ఇల్లును కొనుగోలు చేశారు. ముంబైలోని తన నివాసంలో కత్తితో దాడి జరిగిన కొన్ని నెలల తర్వాత ఈ కొనుగోలు జరిగింది.
ఈ లగ్జరీ అపార్ట్మెంట్ గురించి ఇటీవల సైఫ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఖతార్ చాలా సురక్షితమైన ప్రదేశమని, అక్కడ ఉండటం చాలా మంచి అనుభూతినిస్తుందని సైఫ్ తెలిపాడు. “ఒక హాలిడే హోమ్ లేదా సెకండ్ హోమ్ గురించి ఆలోచించినప్పుడు, నేను కొన్ని విషయాల గురించి ఆలోచిస్తాను. అందులో ఒకటి మనం ఉండేది చాలా దూరం ఉండకుడదు అలాగే సులభంగా చేరుకోనేలా ఉండాలని తెలిపాడు.
తన కొత్త ఇంటిని “ఇంటికి దూరంగా ఉన్న ఇల్లు” అని అభివర్ణించిన సైఫ్, పని నిమిత్తం అక్కడికి వెళ్లినప్పుడు ఆ స్థలానికి మరింత కనెక్ట్ అయ్యానని చెప్పాడు. ఆస్తి యొక్క గోప్యత మరియు విలాసం కలయిక అతనికి బాగా నచ్చిందని ఆయన పేర్కొన్నాడు. తన భార్య కరీనా కపూర్ ఖాన్ మరియు వారి కుమారులు తైమూర్ మరియు జెహంగీర్లను కూడా త్వరలో అక్కడికి తీసుకురావాలని ఆయన ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు.
సినిమాల విషయానికి వస్తే.. సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం “జ్యూయెల్ థీఫ్: ది హీస్ట్ బిగిన్స్” విడుదలకు సిద్ధమవుతున్నాడు. ఇది ఏప్రిల్ 25న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.