‘నేను చాలా స్ట్రాంగ్. పొగిడితే సంతోషిస్తా. విమర్శిస్తే వాటిని రాసుకొని సరిచేసుకుంటా. అంతేకానీ డీలా పడిపోయే కేరక్టర్ కాదు నాది.’ అంటున్నది ముంబై భామ సయీ మంజ్రేకర్. సల్మాన్ ‘దబాంగ్ 3’తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాలభామ తొలి సినిమాకే విమర్శలు ఎదుర్కొన్నది. ఆమెపై విమర్శలు రావడానికి కారణం.. తనకంటే 37ఏండ్లు పెద్దవాడైన సల్మాన్ సరసన నటించడమే. ఈ విషయంపై తాజా ఇంటర్వ్యూలో స్పందించింది సయీ మంజ్రేకర్.
‘సూపర్‌స్టార్ సల్మాన్‌తో తొలి సినిమా చేసే అవకాశం రావడం సామాన్యమైన విషయం కాదు. అందుకే.. ఆలోచించకుండా అంగీకరించా. అసలు ఆ టైమ్‌కి సినిమా అంటేనే నాకు తెలీదు. దానికితోడు పీఆర్ టీమ్ లేదు. నన్ను సిల్వర్‌స్క్రీన్‌పై చూసుకోవాలనే ఆ దుర్దా మాత్రం ఓ రేంజ్లో ఉండేది. ‘దబాంగ్ 3’తో నా కోరిక తీరింది. అయితే.. దానికి తోడు విమర్శలు కూడా వచ్చాయి. 37ఏండ్ల పెద్ద నటుడితో నటించావంటూ ట్రోల్ చేశారు. ఆ ట్రోలింగ్ ప్రభావం నాపై ఉండకూడదని ఆరునెలలు సోషల్‌మీడియాకు దూరంగా ఉన్నా. ప్రారంభంలో ఇలాంటి ఒడిదుడుకులు ఎవరికైనా సహజం’ అంటూ చెప్పుకొచ్చింది సయీ మంజ్రేకర్.