రంజిత్ నారాయణ్ కురుప్, ముస్కాన్ అరోరా జంటగా నటిస్తున్న సినిమా ‘సైదులు’. కేఎమ్ ప్రొడక్షన్స్ పతాకంపై మరబత్తుల బ్రహ్మానందం నిర్మిస్తున్నారు. బాబా పీఆర్ దర్శకుడు. ఇటీవల ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు బాబా పీఆర్ మాట్లాడుతూ…‘హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం ఓ ఊరి జనం చేసిన తిరుగుబాటు నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కించాం. 80వ దశకంలో జరిగిన కథను చూపిస్తున్నాం.
కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరిపాం. త్వరలోనే సినిమాను మీ ముందుకు తీసుకొస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం : ఎన్ఎస్ ప్రసు, సినిమాటోగ్రఫీ : పీఎస్ మణికర్ణన్.