అగ్ర నటుడు డా.రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయితేజస్విని ప్రధానపాత్ర పోషించిన హారర్ డ్రామా ‘ఎర్రచీర’. సుమన్‌బాబు నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎన్.వి.వి.సుబ్బారెడ్డి, సి.హెచ్.సుమన్‌బాబు నిర్మాతలు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయనీ, A సర్టిఫికెట్ లభించిందని, ఈ నెల 24న సినిమాను విడుదల చేస్తున్నామని మేకర్స్ గురువారం ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.
హృద్రోగులు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే ఈ సినిమా చూడాలని మేకర్స్ కోరారు. డివోషనల్ కంటెంట్ ఉన్న ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్, ైక్లెమాక్స్ హైలైట్‌గా నిలుస్తాయని వారు తెలిపారు. శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప పి.శర్మ, సురేశ్ కొండేటి, రఘుబాబు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: గోపి విమల పుత్ర, కెమెరా: చందు, సంగీతం: ప్రమోద్ పులిచర్ల.