Sai Pallavi | నా బ్రెయిన్ వాడలేదు.. సీత పాత్రపై సాయిపల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Sai Pallavi | దర్శకుడు ఇచ్చిన ఏ రోల్ అయినా సరే తన మార్క్ యాక్టింగ్ ఉండేలా చూసుకుంటుంది సాయిపల్లవి. ఈ బ్యూటీ బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోర్‌పతి షోలో ‘రామాయణ’లో తాను పోషిస్తున్న సీత పాత్రను ఆసక్తికర కామెంట్స్ చేసింది.
Sai Pallavi | డ్యాన్సర్‌గా, నటిగా తమిళం, మలయాళంతోపాటు తెలుగులో సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న భామల్లో టాప్‌లో ఉంటుంది సాయిపల్లవి. డైరెక్టర్ ఇచ్చిన పాత్రకు ప్రాణం పోయాలంటే సాయిపల్లవి తర్వాతే ఎవరైనా అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓ వైపు గ్లామర్ రోల్స్ చేస్తూనే.. మరోవైపు నటనకు ఆస్కారమున్న సినిమాలు చేసే సాయిపల్లవి ప్రస్తుతం బాలీవుడ్ మాగ్నమ్ ఓపస్ ప్రాజెక్టు రామాయణలో సీతగా నటిస్తుందని తెలిసిందే.
దర్శకుడు ఇచ్చిన ఏ రోల్ అయినా సరే తన మార్క్ యాక్టింగ్ ఉండేలా చూసుకుంటుంది సాయిపల్లవి. ఈ బ్యూటీ బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోర్‌పతి షోలో ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను రెగ్యులర్‌గా పోషించే పాత్రల కంటే భిన్నమైన వ్యక్తిత్వం ఉన్న సీత పాత్రను పోషించే అవకాశం రావడం గొప్ప బాధ్యత అని చెప్పింది సాయిపల్లవి.
‘నేను పోషించిన ప్రతీ పాత్రకు నా వెర్షన్‌తోపాటు ఇన్పుట్స్ ఇచ్చేదాన్ని. కానీ సీత పాత్ర పోషిస్తున్న సమయంలో అంతటి పవిత్రమైన వ్యక్తిత్వం కలిగిన పాత్ర నుంచి నేనేం పొందగలనో అనే దాని గురించి మాత్రమే ఆలోచించాను. నేను నా బుర్రను (మెదడు) అస్సలు ఉపయోగించలేదు. నేను కేవలం సీతమ్మ ఆశీర్వాదాలు తీసుకొని ఆమె పాత్రను ఆకళింపు చేసుకున్నా’నంటూ చెప్పుకొచ్చింది. కౌన్ బనేగా కరోర్‌పతి షోలో సాయిపల్లవి చేసిన ఈ కామెంట్స్ సీతాదేవి పట్ల ఆమెకున్న గౌరవాన్ని చెప్పకనే చెబుతూనే.. మరోవైపు బిగ్ బీని ఇంప్రెస్ చేశాయి.
Read Also :
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

