సాయిపల్లవి క్రేజ్ అంతకంతకూ పెరిగిపోతున్నది. రీసెంట్గా ‘తండేల్’తో వందకోట్ల విజయాన్ని అందుకున్న ఈ చెన్నై చందమామ.. ప్రస్తుతం బాలీవుడ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘రామాయణ్’లో సీతగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే.. అత్యధిక పారితోషికం అందుకుంటున్న దక్షిణాది కథానాయికల జాబితాను రీసెంట్గా ఓ జాతీయ మీడియా ప్రకటించింది.
అందులో సాయిపల్లవి రెండో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం నటిస్తున్న ‘రామాయణ్’ ప్రాజెక్ట్‌కు సాయిపల్లవి పారితోషికం 20కోట్లు అని ఆ జాతీయ మీడియా వెల్లడించింది. తాను చేయబోయే తర్వాత ప్రాజెక్టుల విషయంలోనూ ఒక్కో సినిమాకూ 13కోట్ల వరకూ సాయిపల్లవి డిమాండ్ చేస్తున్నారట. దక్షిణాదిలో 15కోట్ల పారితోషికాన్ని అందుకుంటూ నయనతార టాప్ ప్లేస్‌లో ఉంటే.. రెండోస్థానంలో సాయిపల్లవి ఉన్నట్టు ఆ జాతీయ మీడియా పేర్కొన్నది.