OTT Movies | ఈ వారం ఓటీటీలో ఎన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.. అందరి దృష్టి ఆ చిత్రంపైనే..!
OTT Movies | సంక్రాంతి సీజన్ ముగిసిన తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కొత్త సినిమాల సందడితో కళకళలాడనుంది. ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాయి. అయితే ఈసారి పెద్ద స్టార్ హీరోల సినిమాలు లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద హడావుడి కొంత తగ్గినట్టే కనిపిస్తోంది.
OTT Movies | సంక్రాంతి సీజన్ ముగిసిన తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కొత్త సినిమాల సందడితో కళకళలాడనుంది. ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాయి. అయితే ఈసారి పెద్ద స్టార్ హీరోల సినిమాలు లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద హడావుడి కొంత తగ్గినట్టే కనిపిస్తోంది. అయినప్పటికీ కొత్త కాన్సెప్ట్స్, విభిన్న కథలతో చిన్న సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి.ఈ వారం విడుదలకు సిద్ధమైన చిత్రాల్లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘యుఫోరియా’ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. దీనితో పాటు ‘సుమతీ శతకం’, ‘శ్రీ చిదంబరం గారు’, ‘హనీ’, ‘ఆపరేషన్ పద్మ’, ‘లగ్గం టైం’, ‘విత్ లవ్’ వంటి సినిమాలు కూడా థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాయి.
స్టార్ క్యాస్టింగ్ లేకపోయినా, కథా బలం మరియు కొత్త నటీనటుల ప్రదర్శనపై ఈ సినిమాల టీమ్లు నమ్మకం వ్యక్తం చేస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా భారీ చిత్రాల మధ్య అవకాశాలు దక్కని చిన్న సినిమాలకు ఇప్పుడు మంచి సమయం దొరికినట్టుగా సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పెద్ద సినిమాల పోటీ లేకపోవడం వల్ల ప్రేక్షకుల దృష్టి ఈ చిత్రాలపై పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా యువ దర్శకులు, కొత్త కథలతో వస్తున్న నిర్మాతలు ఈ వారం విడుదలలను కీలకంగా చూస్తున్నారు. ఇక థియేటర్లతో పాటు ఓటీటీ వేదికలలో కూడా పలు సినిమాలు, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్కు సిద్ధమవుతున్నాయి. రొమాంటిక్ కామెడీలు, థ్రిల్లర్లు, క్రైమ్ డ్రామాలు ఇలా అన్ని జానర్లలో కొత్త కంటెంట్ అందుబాటులోకి రానుండటంతో డిజిటల్ ప్రేక్షకులకు కూడా ఈ వారం ఎంటర్టైన్మెంట్ లోటు ఉండదని చెప్పొచ్చు.
మొత్తంగా చూస్తే, ఈ వారం బాక్సాఫీస్ వద్ద పెద్ద స్టార్ల సందడి లేకపోయినా చిన్న సినిమాలు సినీ ప్రియులకు మంచి వినోదాన్ని అందించనున్నాయి. ప్రేక్షకుల స్పందనపై ఈ చిత్రాల భవితవ్యం ఆధారపడనుంది.
ఇక ఈ వారం ఓటీటీలో (OTT) సందడి చేయబోతున్న చిత్రాలు / సిరీస్లు ఇవే..
నెట్ఫ్లిక్స్ :
క్యాష్ క్వీన్స్ (వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 4
ది లింకన్ లాయర్ 4 (వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 5
సాల్వడార్ (వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 6
అమెజాన్ ప్రైమ్ :
నారీ నారీ నడుమ మురారి – ఫిబ్రవరి 4
రిలేషన్షిప్ గోల్స్ – ఫిబ్రవరి 4
ఫైండింగ్ హార్మోని – ఫిబ్రవరి 6
ఎల్ఓఎల్ (వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 6
జియో హాట్స్టార్ :
ది రాజా సాబ్ – ఫిబ్రవరి 6
జీ5 :
షబద్ రీత్ ఔర్ రివాజ్ (సిరీస్) – ఫిబ్రవరి 6
సోనీ లివ్ :
జాజ్ సిటీ (వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 6
ఆహా :
సైక్ సిద్ధార్థ్ – ఫిబ్రవరి 4
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే, నేహా బోరాను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు.. నిరసన ప్రదేశంలో కఠిన ఆంక్షలు
నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాయే లక్ష్యం : టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
‘జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి’
రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

