Thandel Movie | అక్కినేని హీరో, నటుడు నాగ చైతన్య కెరీర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం తండేల్ (Thandel). కార్తికేయ 1,2 సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న చందు మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించాడు. సాయి పల్లవి కథానాయికగా నటించింది. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇప్పటికే రూ.50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం రూ.100 కోట్ల దిశగా దూసుకెళుతుంది.
అయితే ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో ‘తండేల్’ థాంక్యూ మీట్ (Thandel Thank You Meet) నిర్వహించింది చిత్రబృందం. ఈ వేడుకలో సాయి పల్లవితో కలిసి నిర్మాత అల్లు అరవింద్ డ్యాన్స్ చేశారు. అంతకుముందు హీరో నాగచైతన్య కూడా డ్యాన్స్ చేసి అలరించారు. ఈ సందర్భంగా మూవీ యూనిట్ తమ సినిమాను ఆదరించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. కాగా ఈ డ్యాన్స్‌కి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Sai Pallavi single handed ga laaguthundi #Thandel movie ni
🔥🔥🔥
Akkineni fans gudi kattali Sai pallavi ki pic.twitter.com/fYMSr0m8Ko— TarunTejSrivatsa (@Extra_Emotions_) February 13, 2025