Sai Pallavi | అందం, అభినయం, డ్యాన్స్.. ఇలా జోనర్ ఏదైనా ఆ పాత్రలో జీవించేసే టాలెంటెడ్ భామల్లో టాప్‌లో ఉంటుంది సాయిపల్లవి (Sai Pallavi). సిల్వర్ స్క్రీన్‌పై అచ్చ తెలుగు అమ్మాయిలా మెరిసిపోతూ ఫిదా సినిమాతో ప్రేక్షకులను ఫిదా చేసింది. అయితే తాజాగా సాయిపల్లవి పెళ్లంటూ రూమర్స్ తెరపైకి వచ్చాయి. సాయి పల్లవికి తమిళ దర్శకుడికి వివాహం అంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అయితే ఈ వార్తలో ఎటువంటి వాస్తవం లేదని తర్వాత తెలిసిందే. ఇక ఈ ఘటనపై తాజాగా సాయిపల్లవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
తన పెళ్లిపై వచ్చిన రూమర్స్‌పై సాయిపల్లవి మాట్లాడుతూ.. ”’నిజం చెప్పాలంటే నేను రూమర్లను పెద్దగా పట్టించుకోను, కానీ అవి కుటుంబం లాంటి నా స్నేహితుల గురించి అయినప్పుడు నేను మాట్లాడాలి. నా సినిమా పూజలో దిగిన ఒక ఫొటోనీ క్రాప్ (కట్) చేసి దానిని దురుద్దేశంతో పెయిడ్ అకౌంట్స్ ప్రచారం చేస్తున్నాయి. నేను నా పనికి సంబంధించి మంచి విషయాలు మీతో పంచుకునప్పుడు ఇలాంటి పనికి మాలిన వేషాలు చూసి బాధ కలుగుతుంది. ఇలా ఇబ్బంది కలిగించడం చాలా విచారకరం” అంటూ సాయి పల్లవి సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. ఇక ఈ పోస్టుపై నెటిజెన్లు స్పందిస్తూ.. ఇటువంటి ఫేక్ న్యూస్‌ను ట్రెండ్ చేసేవాళ్ల పని పట్టాలంటూ కామెంట్లు పెడుతున్నారు.
Honestly, I don’t care for Rumours but when it involves friends who are family, I have to speak up.
An image from my film’s pooja ceremony was intentionally cropped and circulated with paid bots & disgusting intentions.
When I have pleasant announcements to share on my work…— Sai Pallavi (@Sai_Pallavi92) September 22, 2023
తమిళ హీరో శివ కార్తికేయన్‌తో కలిసి సాయి పల్లవి ‘SK21’ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాకు రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకుడు. రీసెంట్గా ఈ సినిమా పూజా కార్యక్రమం గ్రాండ్‌గా జరిగింది. అయితే ఈ ఈవెంట్లో చిత్రబృందంతో పాటు సాయిపల్లవి, దర్శకుడు రాజ్‌కుమార్ పెరియస్వామి కూడా మెడలో దండలు వేసుకుని ఫొటోలు దిగారు. అయితే ఈ ఫొటోను కొందరు నెటిజన్లు సగం వరకు క్రాప్ చేసి.. ఆమె పెళ్లి అంటూ నెట్టింట రూమర్స్ సృష్టించారు. దీంతో ఓవర్‌నైట్‌లో ఈ విషయం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యింది. అయితే ఈ వార్తలో ఎటువంటి వాస్తవం లేదని తర్వాత మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.