ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది అందాల భామ సాయిపల్లవి (Sai Pallavi). ఈ సినిమాతో తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది సాయిపల్లవి . ఈ బ్యూటీ గతేడాది చివరగా గార్గి (Gargi)సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
అయితే కొంతకాలంగా కొత్త సినిమాల అప్డేట్స్ రాకపోవడంతో సాయిపల్లవి ఇక యాక్టింగ్‌కు గుడ్ బై చెప్పనుందా..? అంటూ ఓ వార్త ఇండస్ట్రీ సర్కిల్లో హల్ చల్ చేస్తోంది. సాయిపల్లవి మెడిసిన్ (ఎంబీబీఎస్) చదివిందని తెలిసిందే. సినిమాలకు కొంత గ్యాప్ రావడంతో సాయిపల్లవి త్వరలోనే యాక్టింగ్‌కు బై చెప్పి వైద్యరంగంలో తన సేవలు కొనసాగించాలనుకుంటోందని.. ఓ ఆస్పత్రిని కూడా నిర్మించే ఆలోచనలో కూడా ఉందంటూ వార్తలు షికారు చేస్తున్నాయి.
అయితే ఓ కార్యక్రమంలో సాయిపల్లవి మాట్లాడుతూ.. అందం అనేది రూపంలో కాదని గుణంలో ఉందని చెప్పే ప్రేమమ్ లాంటి సినిమాతో తన కెరీర్ మొదలైందంది. అయితే ప్రేమమ్‌లో టీచర్ ఇమేజ్ను తీసివేసేందుకు వేరే పాత్రల్లో నటించాలని ప్రయత్నం చేస్తున్నట్టు పేర్కొంది. అందరూ తనను సొంతింటి ఆడపడుచులా భావించడం చాలా సంతోషంగా ఉందని, మంచి స్క్రిప్ట్‌లు వస్తే భాషతో సంబంధం లేకుండా ఏ సినిమాలోనైనా నటిస్తానని చెప్పింది సాయిపల్లవి.
ఇటీవలే సాయిపల్లవి తన కుటుంబంతో కలిసి స్వస్థలంలోని ఆలయానికి వెళ్లింది. తెలుపు రంగు చీరలో సంప్రదాయ బడుగ వస్త్రధారణ (Baduga style look)లో టెంపుల్‌కు వెళ్లి ఆశీస్సులు తీసుకుంది. సోదరి పూజా, సోదరుడు జితును కూడా ఫొటోల్లో చూడొచ్చు. సాయిపల్లవి ఊటీ సమీపంలోని ఆలయంలో జరిగిన హెతాయ్ హెబ్బా ఉత్సవానికి హాజరైనట్టు తెలుస్తోంది.
బడుగ వస్త్రధారణలో సాయిపల్లవి..