సాయిదుర్గతేజ్ సినిమాల వేగం పెంచారు. ప్రస్తుతం ‘సంబరాల యేటిగట్టు’ సినిమాతో బిజీగా ఉన్న ఆయన.. ఇప్పుడు ఓకేసారి ఇద్దరు యువ దర్శకుల కథల్ని ఓకే చేశారు. ఆ వివరాల్లోకెళ్తే.. ‘సేవ్ ది టైగర్స్’తో అందరి దృష్టిని ఆకర్షించిన యువ దర్శకుడు తేజ కాకుమాను ఇటీవలే సాయిదుర్గతేజ్కు ఓ కథ వినిపించారు. తేజ్‌కి ఆ కథ బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నదని తెలిసింది.
అలాగే.. యూవీ క్రియేషన్స్లోనూ తేజ్ ఓ సినిమా చేయబోతున్నారట. సిద్ధూ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఇదిలావుంటే.. దర్శకుడు దేవకట్టా కూడా సాయిదుర్గతేజ్ కోసం ఓ కథ సిద్ధం చేసుకున్నారు. త్వరలోనే ఆ సినిమా కూడా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఆ మధ్య జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగా సాయిదుర్గతేజ్ కెరీర్ కాస్త నెమ్మదించిన మాట వాస్తవం. ఈ సమ్మర్లో ‘సంబరాల యేటిగట్టు’తో రానున్న తేజ్.. ఈ ఏడాదంతా యాక్షన్ మోడ్‌లోనే ఉండనున్నారు.