Virupaksha Movie Collections | మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ విరూపాక్షతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. శుక్రవారం భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా అంతే భారీ స్థాయిలో కలెక్షన్లు కొల్లగొడుతుంది. నటుడిగా సాయితేజ్‌ను మరో మెట్టు ఎక్కించిందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక దర్శకుడు కార్తిక్ దండూ టేకింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తొలి సినిమాకే ఈ రేంజ్ అవుట్ పుట్ ఇచ్చాడంటే మాములు విషయం కాదు. సినిమాను చూసిన ప్రతీ ఒక్కరు థ్రిల్‌కు గురైతున్నట్లు.. చాలా కాలం తర్వాత టాలీవుడ్లో మంచి థ్రిల్లర్ సినిమా చూశాం అని సినీ ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. కాగా ఇటీవలే ఈ సినిమాపై చిరు ప్రశంసలు కురిపించాడు.
విరూపాక్ష సినిమాపై వస్తున్న రిపోర్ట్స్ అద్బుతంగా ఉన్నాయని చిరు ట్విట్టర్లో పేర్కొన్నాడు. ప్రియమైన సాయి ధరమ్ తేజ్ విరూపాక్షతో గ్రాండ్ కమ్ బ్యాక్ ఎంట్రీ ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని, ప్రేక్షకులు సాయి తేజ్‌ను, విరూపాక్ష సినిమాను ప్రశంసిస్తుండటం ఆనందంగా ఉందని పేర్కొంటూ సినిమా యూనిట్‌ను అభినందించాడు. చిరంజీవి సతీమణి సురేఖ.. సాయి తేజ్‌కు కేక్ తినిపిస్తున్న ఫోటోను ట్వీట్టర్లో పోస్ట్ చేస్తూ మెగాస్టార్ విరూపాక్ష సక్సెస్ పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఇక టాలీవుడ్ సెలబ్రెటీలంతా విరూపాక్ష సక్సెస్‌పై చిత్రయూనిట్‌కు అభినందనలు తెలుపుతున్నారు. ఈ సినిమాకు తొలిరోజే దాదాపుగా రూ.12 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చే చాన్స్ ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఒక ఊరిని వరుస చావులు వెంబటిస్తుంటాయి. ఆ చావులకు గల కారణాలు ఏంటీ అని తెలుసుకోవాడానికి హీరో ఆ ఊరికి వెళ్తాడు. అయితే అక్కడ ఆ హీరోకు ఎలాంటి పరిస్థతులు ఎదురయ్యాయి. అసలు ఆ చావుల వెనక ఉన్న మిస్టరీ ఎంటీ అనే ప్రశ్నల చుట్టు ఈ సినిమా కథ తిరుగుంది. శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించాడు. సాయి ధరమ్‌కు జోడీగా సంయుక్త హెగ్డే నటించింది. సునీల్ కీలకపాత్ర పోషించిన ఈ సినిమాకు ‘కాంతారా’ ఫేమ్ అజనీష్ లోకనాథ్ స్వరాలు సమకూర్చాడు.